Stop Shaving! itis the easiest way to remove hair from the Face

కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే ముఖం, శరీరంపై ఉన్న అవాంచిత రోమాలు నిమిషాల్లో రాలిపోతాయి…….

 చాలామంది అవాంచిత రోమాలతో బాధపడుతూ ఉంటారు. వీటి కారణంగా వారు ఏదైనా ఫంక్షన్స్ మరియు శుభకార్యాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి ఎన్నో ఫ్యాక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనివలన తాత్కాలికి ఉపశమనం కలిగినప్పటికీ. పూర్తిగా తొలగిపోవు. అవాంచిత రోమాలను పూర్తిగా తొలగించుకోవడానికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది.

దీనిని ఏ వయసు వారు అయినా ఉపయోగించవచ్చు. దీని వలన మనకు ఖర్చు కూడా తగ్గుతుంది. చాలామందికి అవాంచిత రోమాలు అప్పర్ లిప్ మీద మరియు గడ్డం కింద ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఉపయోగించడం వలన ఒక్కసారిగా తొలగిపోదు గాని శాశ్వతంగా తొలగిపోతుంది. దీనికోసం మనం ముందుగా ఒక చిన్న చిట్కా పాటించాలి. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న పటికి ముక్క వేసుకొని అందులో కొన్ని వేడి నీళ్లు పోసుకుని పటికి కరగనివ్వాలి. దీనికోసం పటికిపొడి అయిన ఉపయోగించవచ్చు.

ఇలా నీటిలో కరిగిన తర్వాత దూది సహాయంతో అవాంచిత రోమాలు ఉన్న ప్రదేశంలో లేదా ముఖమంతా అప్లై చేసుకుని డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు రెమిడి తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ గోధుమపిండి వేసుకోవాలి. దీనికి బదులు సెనగపిండి లేదా బియ్యపు పిండిని ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక స్పూన్ తేనెను కలుపుకోవాలి. తేనెకు బదులు అలోవెరా జెల్ కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కొబ్బరి నూనెను వేసుకొని కలుపుకోవాలి.

ఇన్స్టెంట్ గా తొలగిపోవాలి అంటే ఏదైనా ఫీల్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అవాంచిత రోమాలు ఉన్న స్థానంలో ఒక ప్యాక్ లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత బాగా డ్రై అయ్యేవరకు ఉంచాలి. ఆ తర్వాత ఏదైనా పొడి గుడ్డ సహాయంతో ఆపోజిట్ డైరెక్షన్ లో రబ్ చేస్తూ ప్యాక్ ను తొలగించుకోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో చేయడం వలన అవాంచిత రోమాలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా క్రమేపి అవాంచిత రోమాల నుంచి శాశ్వతంగా విడుదల పొందవచ్చు. మరలా తిరిగి రావు…..

Leave a Comment

error: Content is protected !!