ఈ సీజన్ లో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్లను పండుగలన్నీ అందరూ జుట్టు స్ట్రైట్నింగ్ కోసం రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులను ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించడం వల్ల డ్యామేజ్ హెయిర్, హెయిర్ ఫాల్ కలిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి క్రీమ్ లో ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులను ఉపయోగించకుండా పార్లర్‌కి వెళ్ళనవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే మీ చుట్టూ స్టైల్‌గా చేసుకోవచ్చు ఈ చిట్కా ఉపయోగించడం వల్ల మీ జుట్టు స్ట్రైట్ గా అవడమే కాకుండా సిల్కీ గా ఉండి పట్టులా మెరిసిపోతుంది.
దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. దీనిలో నాలుగు చెంచాల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. తర్వాత ఒక క్లాత్ వేసి వడ కట్టుకొని జెల్ సపరేట్ చేసుకోవాలి. ఒక కప్పు ఐసు గింజలను ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకోవాలి. దీనిలో ఒక కప్పు ఆలోవెరా జెల్ వేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవిస గింజల జెల్ వద్దు అనుకున్న వాళ్ళు అరటిపండు ఉపయోగించుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పాయలు పాయలుగా విడదీసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత జుట్టు ముడి పెట్టకూడదు ఫ్రీగా వదిలేయాలి. ఆరిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత మీ జుట్టు చాలా స్మూత్ గా మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అన్నం జుట్టు ను మోసం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అవిస గింజలు జుట్టు టైపింగ్ కోసం చాలా బాగా పనిచేస్తాయి.
అలాగే జుట్టు రాలడం తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు స్మూత్‌గా, సిల్కీగా ఉంచడానికి సహాయపడుతుంది. స్ట్రైట్ గా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి ఎలక్ట్రికల్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెషిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పార్లర్‌కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ జుట్టును స్ట్రైట్ గా, సిల్కీగా చేసుకోవచ్చు.