ప్రస్తుతం అతని పరిస్థితిలో ఆహారపాల వారి వలన ప్రతి ఒక్కరు జుట్టు రాలడం సంస్థ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే జుట్టు రాలడం తగ్గించుకుని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మందార పూలను తీసుకుని నీటిలో వేసుకుని తర్వాత ఒక బౌల్ తీసుకొని మందార పూలు రేకలను విడదీసి వేసుకోవాలి.
తర్వాత ఒక గులాబీ పువ్వు రేకలను కూడా వేసుకోవాలి. గులాబీ రేకులు వాసన కోసం మాత్రమే. గులాబీ రేకులు వద్దనుకున్నారు సన్నజాజి లేదా మల్లి పూలు కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మెత్తగా చేతితో నలుపుకోవాలి లేదా మిక్సీ పట్టుకున్న పర్వాలేదు. ఫ్రెష్ గా ఉండే మందార పూలు దొరకని వారు మందార పౌడరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వడకట్టుకుంటే జెల్ లాంటి పదార్థం వస్తుంది. దీనిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకున్నవారు ఆముదం లేదా మీరు రెగ్యులర్ గా రాసుకునే నూనె ఒక చెంచా వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక వారం పది రోజులకు సరిపడినంత ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిజ్లులో పెట్టుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేసుకోవాలి. మందారం జుట్టు కుదుళ్లకు కావలసిన బలాన్ని ఇచ్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు రావడం లేదు అనుకునే వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు జుట్టు పెరగట్లేదు అనుకునే వారు అందరూ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో మందార పువ్వులు మంచిగా ఉపయోగపడతాయి.
ఈ చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. కొంతమందికి జుట్టు పొడవుగా ఉంటుంది.కానీ సన్నగా ఉంటుంది. అలాంటి వారు కూడా దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా తయారవుతుంది. మందార పువ్వులు జుట్టుకు కండిషనర్ లాగా ఉపయోగపడతాయి.