sugar control ayurvedic drink homemade

380 లేదా 480 షుగర్ ఉన్నా 30సంవత్సరాలు నుంచి బాధపడుతున్న ఈ కషాయం తాగితే అదుపులోకి తెస్తుంది

డయాబెటిస్ ఈ కాలంలో వయసుతో సంబంధంలేకుండా అందరినీ వేధిస్తున్న దీర్ఘకాలిక జబ్బులతో ఒకటి. దీనితో చాలామంది శారీరకంగా, మానసికంగా చాలా బాధపడుతున్నారు. వీటికి మందులతోపాటు కొన్ని ఇంటిచిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 

మొదటిది నేరేడుగింజలు. మనం పండు తిని పారేసే గింజలు అద్బుతమైన ఫలితాన్ని ఇస్తాయి. వీటిని ఎండబెట్టి పొడిచేసి వేడినీటిలో కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వలన రక్తంలో గ్లైసెమిక్స్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. 

దానితో పాటు నీటిని బాగా తాగాలి. రోజూ నడక జీవితంలో భాగం కావాలి. యోగా లేదా వ్యాయామం చేయడం వలన శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే పచ్చి కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. వండని ఆహారం తినడంవలన కూడా ఆరోగ్యంలో మంచిమార్పులు చూస్తారు. 

సన్నగా ఉండే మంచి మెంతులు కూడా తీసుకుని రాత్రుళ్ళు గ్లాసుడు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని కొంచెం వేడిచేసి గోరువెచ్చగా నీటిని తాగేసీ మెంతులను నమిలి తినాలి. మెంతులలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడంతో పాటూ మలబద్దకం, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.

  రోజులో కనీసం గంటసేపు ఎండలో ఉండాలి. శరీరం టాన్ అవుతుంది అని భయపడకుండా ఎండను శరీరానికి అలవాటు చేస్తే ఎండనుండి శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. విటమిన్ డి లోపం కనుక ఏర్పడితే శరీరం మన ఆహారంలో తీసుకునే పోషకాలను గ్రహించలేదు. 

ఇక చివరది, ముఖ్యమైనది తిప్పతీగ. కరోనా మొదలైనప్పటి నుండి తిప్పతీగ యొక్క గుణాలు గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. తిప్పతీగ అనేక ఔషధాల గని. తాజాగా తిప్పతీగ దొరికితే జ్యూస్ లా చేసుకుని తాగొచ్చు లేదా అన్ని ఆయుర్వేద ఔషధాల షాపుల్లో గిలాయ్ పౌడర్ పేరుతో తిప్పతీగ పొడి అందుబాటులో ఉంటుంది. ఈ పొడిని వేడినీటిలో వేసుకుని తాగడం వలన డయాబెటిస్ తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు. అందుబాటులో ఉండే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వలన ఎటువంటి దుష్పభవాలు లేకుండా షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!