summer skin care tips for women

మగువల ముఖారవిందం కోసం అద్భుతమైన చిట్కాలు!!

అందరూ బ్యూటీపార్లర్స్ కు వెళ్ళలేరు. అందులోనూ ఇప్పుడు కరోనా వైరస్ ఉండడం వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం అతివలు తరచూ వాడే  సౌందర్య సాధనాల పై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా  బయటికి వెళ్లడానికి సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే అద్భుతమైన అందానికి మెరిసే చర్మం పెంపొందించుకోవడానికి కొన్ని సౌందర్య చిట్కాలు మీకోసం

◆తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది.  రోజుకు రెండుసార్లు ముఖంపై తేనె అప్లై చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది కాలిన గాయాలకి కూడా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. గాయాలు మచ్చలు ఉన్న చోట తేనెను ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే ఆ మచ్చలు మటుమాయం అవుతాయి

◆నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను కూడా వాడవచ్చు. నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల  వల్ల ముఖం‌పై పేరుకుపోయిన మురికి మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. వాడేసిన నిమ్మ చెక్కలని మోచేతులకి మోకాళ్ళకి రుద్దుతూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది

◆ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని మొహంపై సున్నితంగా పది నిమిషాలు మెల్లిగా రుద్దాలి తర్వాత పావుగంట ఆగి చల్లనినీళ్ళతో మొహం కడుక్కోవాలి.

◆ కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

◆తులసి ఆకులతో ముఖం మెరిసిపోవాలి అంటే  తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది. 

◆ కొంచెం సెనగపిండిలో పసుపు పెరుగు కొంచెం చందనం వేసి పల్చటి పేస్టులా కలిపి ముఖానికి మెడకి చేతులకి పట్టించి ఓ అరగంట వదిలేసి  బాగా ఆరిన తర్వాత మొహం మీద ఉన్న సెనగపిండిని చేతుల తో మెల్లగా రుద్దుతూ పిండి అంతా పోయేలా చేసి గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటే చర్మం చాలా కాంతివంతంగా స్మూత్ గా బావుంటుంది. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మొహానికి శనగపిండి పెట్టేముందు కొంచెం ముఖానికి ఆయిల్ అప్లై చేయాలి.

◆పెదవులు ఎలాంటి లిప్స్టిక్. లిప్ బామ్ లేకుండా ఎర్రగా ఉండాలి అంటే రాత్రి నిద్రపోయే ముందు కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకునీ బాగా నలిపితే రసం వస్తుంది. ఆ రసాన్ని పెదవులకు అప్లై చేస్తే వెంటనే ఆరిపోతూ ఉంటుంది. అలా నాలుగైదు సార్లు రాసుకుని రాత్రంతా వదిలేస్తే పొద్దున కి మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి.

◆ పెదవుల అందానికి బీట్రూట్ కూడా బాగా పనిచేస్తుంది చిన్న బీట్రూట్ ముక్క తీసుకునీ సున్నితంగా పెదవుల మీద ఒక ఐదు నిమిషాలు రుద్దుతూ ఉండాలి. ఈ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది.

◆మొహం బాగా మురికిగా అనిపించినప్పుడు బంగాళదుంప రసం లేదా టమోటో రసం ఏది వీలు అయితే అది మొహానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళ తో మొహం కడుక్కొని ఉంటే చర్మంపై ఉన్న మురికి అంతా పోయి మొహం కాంతివంతంగా ఉంటుంది.

◆గులాబీ రేకుల్ని మెత్తగా పేస్ట్ చేసి  ఆ ముద్దను ముఖానికి పట్టించినా మంచి నిగారింపు ఉంటుంది

చివరగా …….

ఇలా మన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. సౌందర్యాన్ని సహజంగా సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!