Sun Stroke Signs and Symptoms in Telugu

వడదెబ్బ కూడా అబ్బా అని పారిపోయేలా చేసే సులువైన వంటింటి చిట్కాలు!!

వేసవి కాలం చాలా వేడిగా అందరినీ కాస్త ఇబ్బంది పెడుతూ ఉండే కాలం. ఎండలో బయటికి వెళ్ళ కూడదు అన్నా కొన్నిసార్లు ఏవో ఒక పనుల వల్ల తప్పనిసరిగా బయటికి వెళ్లి పనులు చూసుకొని  రావాల్సిన అవసరం కలగవచ్చు. వడదెబ్బ అంటే మన శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ కు గురి కావడం అన్నమాట.

వడ దెబ్బ వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్టుగా నిస్సత్తువగా మారడం, శ్వాస తీసుకోలేక పోవడం, అబ్ నార్మల్ హార్ట్ బీట్, బాగా నీరసించిపోవడం కొన్నిసార్లు ప్రాణాలకి కూడా ప్రమాదం జరుగుతుంది వడదెబ్బకి  సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. వడదెబ్బకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యం ఎండ బారిన పడకుండా పదిలంగా ఎలా ఉంచుకోవాలో  ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

◆వడ దెబ్బ కి పచ్చి ఉల్లి పాయ మంచి ఔషధంగా పని చేస్తుంది. పచ్చి ఉల్లిపాయను దంచి రసం తీసి ఆ రసాన్ని ఛాతికి వెనుక వీపుకి పట్టించి కాసేపు ఉంచితే శరీరంలో వేడి తగ్గుతుంది, అంతేకాదు వేసవి కాలం తప్పనిసరిగా  పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని సలాడ్స్ లోనూ మనం తినే ఆహారంలోను రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి.

◆ దీని  నుంచి తప్పించుకోవడానికి మరో హోమ్ రెమిడీ చింతపండు నీరు. కొంచెం చింతపండు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి చిక్కగా రసం తీసి  ఆ నీటిని పది నిమిషాల సేపు మరిగించి చల్లార్చి గోరువెచ్చగా తాగుతూ ఉంటే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీటిలో మినరల్స్ ఎలక్ట్రోలైట్స్  విటమిన్స్ ఉంటాయి, ఈ నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

◆కొబ్బరి నీరు కూడా వడదెబ్బ నుంచి మనల్ని రక్షిస్తుంది. కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. వేసవికాలంలో ఉప్పు వేసిన పల్చని మజ్జిగ ఎక్కువసార్లు తాగడం కూడా మంచిదే,  పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, కొత్తిమీర కూడా పుదీనా లాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. కొత్తిమీర పుదీనా కలిపి జ్యూస్ చేసుకుని వేసవి కాలంలోప్రతి రోజూ ఒక గ్లాస్ తాగితే అసలు వడదెబ్బ మీ దరికి చేరదు.

◆ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వడ దెబ్బ కి బాగా పనిచేస్తుంది ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది, అలోవెరా జ్యూస్ కూడా వేసవి వడదెబ్బ నియంత్రిస్తుంది. రోజు పరగడుపునే ఒక స్పూన్ వెనిగర్ జెల్ నీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగితే వడదెబ్బ బారిన పడరు.

◆ఇవన్నీ కాకుండా మంచి చందనం కూడా వడదెబ్బ నుండి నివారించడానికి బాగా పనిచేస్తుంది. ఎండలో నుంచి బయటికి వెళ్లి రాగానే గంధాన్ని అరగదీసి మొహానికి ఫేస్ ప్యాక్ లా వేసుకొని ఓ అరగంట తరువాత కడిగేసుకుంటే చల్లగా అనిపిస్తుంది. ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.

చివరిగా….. 

చూశారా వడదెబ్బ కి మన ఇంట్లోనే ఎన్ని పరిష్కారాలు ఉన్నాయో. వడదెబ్బ అనగానే భయపడిపోయి హాస్పిటల్కి పరిగెట్టకుండా  ఇవన్నీ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, వడదెబ్బ నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు, డీహైడ్రేషన్ కీ గురికాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు, మీరు కూడా తప్పకుండా ఇవన్నీ ప్రయత్నించండి. ఎండాకాలంలో చల్లగా ఉండండి.

Leave a Comment

error: Content is protected !!