super fast hair growth home remedy

పలుచగా అయినా జుట్టు కూడా ఒత్తుగా పెరిగేలా చేసే హెయిర్ గ్రోత్ సీక్రెట్

కొంతమందికి   జుట్టు బాగా పల్చబడి పోయి ఉంటుంది.  వర్షాకాలం జుట్టు  రాలడం బాగా ఎక్కువ అవుతుంది.  తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు బాగా పలుచగా అయిపోయే అవకాశం ఉంటుంది.  మార్కెట్లో దొరికే కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడినప్పటికీ   ఎటువంటి ప్రయోజనం ఉండదు. చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేసినప్పటికీ కూడా రిజల్ట్స్ ఏమి లేదు  నా జుట్టు  ఇంకా పెరగదు అనుకున్న వాళ్లు ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి. కేవలం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఈ హెయిర్ సీరంను తయారు చేసుకొని వాడినట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

ఒక వెంట్రుక ఊడిన దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి. ఏమిటి తయారు చేసుకోవడానికి కావలసినవి మందార పూలు, రైస్. మనం ఈ  చిట్కా కోసం రేఖ మందారం, ముద్ద మందారం ఏ  రకం మందారపూలు అయినా సరే ఉపయోగించుకోవచ్చు. మందర పూలు మీ హెయిర్ కు సరిపడా అంటే నాలుగు లేదా ఐదు పూలు తెచ్చి రేకలు వేసి పక్కన పెట్టుకోవాలి.  తర్వాత ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ తో బియ్యం వేసి బాగా కడిగి రెండు పెద్ద  గ్లాస్ తో నీళ్లు వేసి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మందార పువ్వుల రేకులను వేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. 

అన్నం మనం రోజు ఇంట్లో వండుకునే లాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.  మందార పూలు జుట్టురాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తాయి.   ఒక వెంట్రుక రాలిన దగ్గర 10 వెంట్రుకలు రావడం లో ఇవి బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఉండే అమైనో యాసిడ్ బట్ట తలపై కూడా జుట్టు వచ్చేలాగా చేస్తాయి. అన్నం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. దానిలో ఉండే నీటిని వడగట్టి ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు.  వడకట్టుకున్న అన్నాన్ని మెత్తగా మిక్సీ పట్టి హెయిర్ ప్యాక్ లా  యూస్  చేసుకోవచ్చు. 

ఈ నీటిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదా  ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మీ సీరంను  జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవడం కుదరదు అనుకున్నవాళ్ళు కుదుళ్ళ  దగ్గర మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ప్రతిరోజు  దీనిని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయటికి వెళ్ళాలి అనుకుంటే తలస్నానం చేయడానికి ఒక గంట ముందు అప్లై చేసుకోవాలి. వరుసగా రెండు నెలల పాటు ఉపయోగించినట్లయితే పరచ బడిన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

Leave a Comment

error: Content is protected !!