ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి కావలసిన అత్యంత అవసరమైనవి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరం స్వయంగా తయారు చేయలేని కొవ్వు రకం. అవి ఒక ముఖ్యమైన కొవ్వు, అంటే అవి మనుగడకు అవసరమవుతాయి. మనం తినే ఆహారాల నుండి మనకు అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. చేపలు ఒమేగ త్రీ కొవ్వు ఆమ్లాల యొక్క ముఖ్య ఆహార వనరు. కొన్ని మొక్కలలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలలో రెండు రకాల ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంంటాయి.
మొక్కలలో ఒమేగా -3 రూపాన్ని ఆల్ఫా-లినోలెనిక్ (ALA)ఆమ్లం అంటారు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా అవిశెగింజలు, చియాసీడ్స్ ,వాల్నట్స్, బాదం, ఆలివ్ ఆయిల్ ల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు దొరుకుతాయి. ముఖ్యంగా జొన్నలు, రాగులు, కొర్రలు, అరిగెలు, ఊదలు, సామలులో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు లభిస్తాయి. ప్రతిమనిషికి 500-700 మిగ్రా ఫ్యాటీ ఆసిడ్ తీసుకోవాలి. అధికంగా శారీరక శ్రమ చేసేవారు 3-5 గ్రాముల ఒమెగా 3 యాసిడ్స్ తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద మీ లింక్ చూడండి..
మీ ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు: హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అసాధారణ గుండె వ్యాధుల వల్ల ఆకస్మిక గుండె పోటు తగ్గించి మరణ ప్రమాదానికి దూరంగా ఉంచుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తపు ప్లేట్లెట్స్ను కలిసిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
ధమనుల యొక్క పొరను మృదువుగా మరియు మందపాటి, గట్టి ధమనులకు దారితీసే నష్టం లేకుండా ఉంచుతాయి. ఇది ధమనులలో గడ్డలు ఏర్పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కాలేయంలో ఏర్పడే రేటును తగ్గిస్తుంది. రక్తంలో అధిక స్థాయిలో ట్రైగ్లిజరైడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భవతుల్లో పుట్టబోయే బిడ్డ ఒమెగా త్రీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.మానసిక వికాశం ఎదుగుదలకు సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు, అల్జీమర్స్ రాకుండా చేస్తుంది. స్త్రీ పురుషులలో వంధ్యత్వం తగ్గించి సంతానం కలిగేలా చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా చేసి మెరిసే, బలమైన జుట్టును అందిస్తుంది. కొవ్వులు పేరుపోకుండా చేసి అధికబరువును తగ్గిస్తుంది. డిప్రెషన్ దూరం చేస్తుంది. కీళ్ళనొప్పులు ఉన్నవారికి కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిది. వాపును తగ్గించి నొప్పులు దూరం చేస్తుంది. అలాగే చర్మరక్షణలో కూడా దోహదపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేసి మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తుంది. ఆహారంలో అందకపోతే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లోపం ఏర్పడినపుడు మార్కెట్లో దొరికే క్యాపుల్స్ కూడా వాడవచ్చు. ఇవి మెత్తటి జెల్ రూపంలో ఉంటాయి.డాక్టర్ సలహాతో తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.