ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి,మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దానికోసం రకరకాల మందులు ఉపయోగించినప్పటికీ ఉపశమనం ఉండట్లేదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించడం వల్ల కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మనం ముందుగా కలబంద మట్ట తీసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకోవాలి. తర్వాత కలబంద మధ్య గుజ్జు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ గుజ్జుని చెంచాతో మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి. ప్యాకెట్ పసుపు కాకుండా కొమ్ములు పట్టించుకున్న పసుపు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత జిల్లేడు ఆకులను తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులను అట్ల రేకు బోర్లించి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలి.
తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న జిల్లేడు ఆకులను కూడా అట్ల రేకు వేడెక్కిన తర్వాత ఆకులను తిరగేసి పెట్టి వేడెక్కించాలి. తడి ఆరేంతవరకు వేడెక్కించాలి. తర్వాత మళ్లీ ఆకులకు వెనుక భాగంలోనే ఆవనూనె అప్లై చేసి వేడెక్కించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేసి ఆవనూనె అప్లై చేసి వేడి చేసుకున్న జిల్లేడు ఆకులను వేడి చేసిన భాగం లోపలి వైపు ఉండేలాగా పెట్టి తాడుతో గట్టిగా కట్టాలి.
నొప్పి ఉన్న భాగంలో ఇలా పెట్టడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని రాత్రి పడుకునే ముందు పెట్టి ఉదయం వరకు అలా వదిలేయాలి. వరుసగా రెండు లేదా మూడు రోజుల పాటు ఈ చిట్కా పాటించినట్లయితే మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి కదలలేని స్థితిలో ఉంచిన నొప్పులను కూడా తగ్గిస్తుంది. మోకాలు నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, మోచేతి నొప్పి, మెడ నొప్పి వంటి ఎటువంటి నొప్పి అయినా తగ్గించడంలో ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో మందులు ఉపయోగించి విసిగిపోయిన వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. ఒక్కసారి అప్లై చేసేసరికి ఉపశమనం లభిస్తుంది.