తాటి చెట్టును తీసుకుంటే వేరు దగ్గర్నుంచి ఆకు దాకా ప్రతీది ఉపయోగకరంగానే ఉంటుంది. అంటే వేసవి కాలంలో ముంజు కాయలు, వర్షాకాలంలో తాటికాయలు, శీతాకాలంలో తేగలు ఇలా దీని యొక్క సంపాదన మానవాళికి ఆహారంగా ఉపయోగపడుతుంది. తేగలు తిన్నాక మొక్క బుర్ర గుంజు కూడా ఉపయోగమే. ఇవి అద్భుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మరి చలికాలంలో వచ్చే ఈ తేగలు ఎక్కడ దొరికిన కచ్చితంగా తినాలి. ఈ కాలంలో ఈ తేగలు తింటే సైంటిఫిక్ గా ఏమి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. డైజీషన్ని యాక్టివేట్ చేయడానికి తేగలు బాగా ఉపయోగపడతాయి.
ఈ తేగలలో తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనిలో హై ఫైబర్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 20 గ్రామ్స్ ఉంటుంది. దీనిలో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ అవుతాయి. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. షుగర్ పెరగకుండా ఉండడానికి ఈ తేగలను గ్లైస్మిక్స్ ఇండెక్స్ 55 ఉంటుంది. ఈ గ్గ్లైస్మిక్స్ మీకు ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల షుగర్ పెరగదు అని సైంటిఫిక్ గా నిరూపించారు. వీటిని తినడం వల్ల మలబద్ధకం కూడా నార్మల్ గా ఉంటుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. ఈ తేగలను తిన్నవారికి మోషన్ తేగల వాసన వస్తుంది.
యూరిన్ కూడా తేగల వాసన వస్తుంది. ఈ ఫైబర్ అనేది 50% ప్రేగులలో డైజెస్ట్ అవుతుంది. దీనివల్ల ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రేగులో ఉండే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా పెంచడానికి ఈ తేగలు బాగా ఉపయోగపడతాయి. రక్తనాళాలకి రిలాక్స్ చేయడానికి అద్భుతంగా పనికొస్తాయి. దీనిలో మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో ఉండడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దీని వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుంది. తేగలలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బోన్స్ కి చాలా మంచిది. బ్లడ్ ఫార్మింగ్ కి కూడా చాలా మంచిది. తేగలు నమలడం వల్ల దంతాల గార పోతుంది.
బాడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. ఈ తేగలను రెండు రకాలుగా అమ్ముతారు. ఉడకబెట్టిన తేగలు, కాల్చిన తేగలు. ఇలా ప్రకృతి లో లభించే చక్కటి ఆహారాన్ని ఏ కాలంలో లభిస్తే ఆ కాలంలో తింటే ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు.