కోవిడ్ సోకిన వ్యక్తికి శరీరం తన ఆధీనంలో ఉండదు. మన శరీరంలో వైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కి కొన్ని కణాలు చనిపోతాయి. అనవసరమైన కణాలు బోలెడు ఉంటాయి. ఇవన్నీ దేహంలో కుప్పలు కుప్పలుగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి అనవసరమైన కణాల్ని, మృత కణాల్ని నిర్మూలించడానికి వాటి స్థానంలో కొత్త కణాలు పునరుద్ధరించబడడానికి విటమిన్ K అనేది అతి ముఖ్యమైనది. కేవలం విటమిన్ K రక్తం గడ్డ కట్టడానికి మాత్రమే అని అనుకుంటాం. కానీ రక్షణ వ్యవస్థకి విటమిన్ K అనేది చాలా అవసరం. కాబట్టి విటమిన్ K ఉన్న ఆహారాలు ప్రతిరోజు తీసుకోవాలి. విటమిన్ K అన్నిట్లో కంటే ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది.
అందుకని ఆకుకూరలు కనబడితే మార్కెట్లో వదలకండి. తప్పనిసరిగా తీసుకోండి ప్రతిరోజు ఆకు కూరని తింటే మంచి ఫలితాలు వస్తాయి. ఏ ఆక్కూరైన ప్రతిరోజు ఏదోక రకంగా పప్పులో గాని, ఏదో ఒకలాగా తినాలి. ఇలా రోజుకు ఒక ఆకు కూర తింటే రక్షణ వ్యవస్థ కావాల్సిన అనేక పోషకాలు విటమిన్ K తో పాటు లోపలికి వెళ్తాయి. ఒక కప్పు ఉడికించిన ఆకుకూరల్లో 800 గ్రాముల విటమిన్ K లభిస్తుంది. పచ్చి బటానిలో కూడా విటమిన్ k ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీలో కూడా విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. విటమిన్ K తో పాటు విటమిన్ సి, విటమిన్ a, విటమిన్ b6 లాంటివి కూడా లభిస్తాయి.
ఇలా విటమిన్ K ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తక్షణమే రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. విటమిన్ K ఎముక గుండె మెదడు పని తీరుకు బాగా అవసరం. శరీరంలో విటమిన్ K లోపం ఉంటే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ K లో రెండు రకాలు ఉన్నాయి. అవి విటమిన్ K1 (ఫెలో క్వినోన్) విటమిన్ K2 (మోనాకాసినోన్) ఇమ్యూనిటీ బాగా చురుగ్గా పనిచేస్తుంది. కొత్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. ఇది రెండు శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి రక్తస్రావం జరగకుండా ఉండడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి కూడా విటమిన్ K బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
కాబట్టి విటమిన్ K లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితానికి విటమిన్ K చాలా అవసరం.