ఏదైనా వ్యాధి వస్తున్నప్పుడు ప్రారంభదశలోనే శరీరం సూచనలు చేస్తుంటుంది. మనం గమనించక నిర్లక్ష్యం చేయడం మూలంగా అవి ప్రమాదకర వ్యాధులుగా మారిపోతుంటాయి. శరీరంలో అప్పుడప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం వాపులకు గురవుతుంటాయి. అలాంటప్పుడు మనం భయపడుతుంటాం. ఇలా వాపులు రావడాన్ని ఎడీమా అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద విషయంగా మారిపోతుంది. శరీరంలో సోడియం ఎక్కవయితే ఈ వాపులు అనేవి వస్తుంటాయి. సోడియం ఎక్కవవడానికి కారణం మన ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. అలాగే నీళ్ళు తక్కువగా తాగడం. ఆహారంలో ఎక్కువగా తీసుకున్న సోడియం శరీరంలో పేరుకుపోతుంది. మరింత సమాచారం కోసం ఈవీడియో చూడండి
నీరు తాగడం తక్కువగా ఉండడం వలన మూత్రంలో బయటకు పోవడం ఉండదు. ఇలా పేరుకున్న సోడియం కిడ్నీలలో చేరి వాపులు వచ్చేలా చేస్తుంది. అందుకే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా వాపులు కనిపిస్తుంటాయి. పదకొండు సంవత్సరాలు పైబడిన ప్రతివ్యక్తికి రోజుకి ఐదు గ్రాముల ఉప్పు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వలన మనం హైపర్ టెన్షన్‌కి గురవుతుంటాం. ఈ హై బిపీ ఎక్కువ రోజులు కొనసాగితే గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులకు గురవుతుంటాం.
దానితోపాటు గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం సమస్యలు మొదలవుతాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో ఉప్పు తక్కువ వాడడంవలన ఈ వ్యాధుల ముప్పు తక్కువ చేసుకోవచ్చు.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి చేతులలో వాపులు కనిపిస్తాయి. లివర్‌లో వ్యాధులు కలవారికి ఉదరంలో నొప్పి, వాపులు ఉంటాయి. కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ముఖం, కాళ్ళలో వాపులు కనిపిస్తాయి. ఊపిరితిత్తులలో నీరు చేరితే ఒళ్ళంతా వాపులు కనిపిస్తాయి. అధిక బరువు, రోజంతా కూర్చుని లేదా నిలబడి ఉండడం, ఆపరేషన్లు జరగడం, గర్భంతో ఉన్నప్పుడు, సరైన సమయంలో తినడంపోవడం కూడా వ్యాధులకు కారణమవుతుంది. దీనికోసం రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుని అరకప్పు ధనియాలు వేసి గ్లాసు నీళ్ళయ్యేవరకూ మరిగించి ఆ కషాయం తీసుకోవడం వలన ఇది మూత్రంద్వారా సోడియం ను బయటకుపంపించివేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని, యాంటీ ఆక్సిడెంట్ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ కషాయంవలన నెలసరి నొప్పి, అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ధనియాల కషాయం చాలా మంచిది. అలాగే బీన్స్ ఆహారంలో భాగం చేసుకోవడంవలన పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం స్థాయిలను తగ్గిస్తాయి. విటమిన్ సి ఉండే పండ్లు, ఉడికించిన బంగాళదుంపలను తినడంవలన వాపులను నిరోధించవచ్చు. అలాగే వేడినీటిలో కొంతసేపు చల్లనీటిలో కొంతసేపు ఉండడంవలన హైడ్రోథెరపీ జరిగి శరీరంలోని వాపులు తగ్గుతాయి. వాపులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడంవలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.