Symptoms and Signs of Kidney Renal Failure

ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్

మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైన అవయవాలో కిడ్నీలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన అవయవాలు. మనం తినే ఆహారాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే ప్రతిరోజు విశ్రాంతి లేకుండా పని చేసే కిడ్నీలలో టాక్సిన్స్ పెరిగిపోయి కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అనేక కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో రాళ్లు,  సిస్టులు ఏర్పడటం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి రోజూ తగినంత నీటిని తాగడంతో పాటు కొన్ని చిట్కాలు శరీరాన్ని, కిడ్నీలను డీటాక్సిఫై చేసి శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాంటి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 మొక్కజొన్న పొత్తులు తెచ్చినపుడు వాటి పైన ఉండే పీచు పాడేస్తూ ఉంటాం. అయితే మొక్కజొన్న పీచు లో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మొక్కజొన్న పట్టును ఔషధంగా ఉపయోగిస్తారు.  కార్న్ సిల్క్ మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు, మూత్ర వ్యవస్థ యొక్క వాపు, ప్రోస్టేట్ యొక్క వాపు, మూత్రపిండాల్లో రాళ్లు మరియు బెడ్‌వెట్టింగ్  నివారణ కోసం ఉపయోగించబడుతుంది.  ఇది రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కజొన్న పీచును సేకరించి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగి నీళ్ళు రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి నిమ్మరసంతో వేడివేడిగా తీసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు మూత్రం రూపంలో బయటకు పంపుతుంది.

తర్వాత చిట్కా కోసం పుచ్చకాయ విత్తనాలు తీసుకోవాలి. వీటి పై పొట్టు తీసేసి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని తెచ్చుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటికి రెండు స్పూన్ల విత్తనాల పొడి వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగించి ఈ టీని తాగడం వలన కిడ్నీలో పేరుకున్న విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ విత్తనాలు అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వారానికి ఒకసారి తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.

 తర్వాత కోసం ముల్లంగి ఆకులను తీసుకోవాలి. ముల్లంగి కాలేయం, కిడ్నీ మరియు పొట్టకు చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే అవి శక్తివంతమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి.  ముల్లంగి రక్తానికి తాజా ఆక్సిజన్ సరఫరాను పెంచడం ద్వారా కామెర్లు వల్ల కలిగే ఎర్ర రక్త కణాల నాశనాన్ని తగ్గిస్తుంది. ముల్లంగి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి  మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనినుండి జ్యూస్ను సేకరించి తాగడం వలన శరీరంలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. దీనిని రోజుకు ఒకసారి తాగడం వలన  శరీరం మొత్తం శుభ్రపడుతుంది. కిడ్నీ సమస్యలు దూరంగా ఉంచడానికి ఈ మూడు చిట్కాలలో ఏదో ఒక దానిని పాటించడం వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!