Symptoms of Vitamin B12 Deficiency Anemia

అరటిపండు తినేవారు ఇది తెలుసుకోండి. నాలాగ మీరు నిర్లక్ష్యం చేయకండి.

ఇప్పటి ఆహార వ్యవస్థలో సరైన పోషకాలు శరీరానకి అందుతుంది అన్న నమ్మకం బహుశా ఎవరిలో లేదు. అందులో మన జీవిత విధానం కూడా రోజు రోజుకి మమ్మల్ని అనారోగ్యం పీడితులని చేస్తుంది.

ఈ రోజు ఇలాంటిదే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. రక్తంలో విటమిన్ బి-12 తగ్గితే ఎలాంటి ఇబ్బందీ కలుగుతుంది! వాటికి పరిహారం ఏంటి! విటమిన్ బి-12 అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. కానీ, ఈ కాలంలో చాలా మందిలో విటమిన్-బి12 లోపం ఉంటుంది.

*బి-12 లోపాన్ని తెలిపే సూచనలు. 

– బి-12 లోపం వల్ల రక్తహీనత మరియు నరల బలహీనత ఎదురుకుంటాం.-  మెగ్లోబ్లాస్టిక్ అనే అనీమియా ( రక్తహీనత) సృష్టిస్తుంది. -జుట్టు మూల జీవకణాలను, వెన్నులోని శక్తిని కృశించెలా చేస్తుంది.- అలసట, శక్తిహీనంగా అనిపించటం.-ఊపిరాడాతానికి క్లిష్టంగా ఉంటుంది.-విపరీతమైన తలనొప్పి, చిరాకు, కోపం ఎక్కువ రావటం.-నాలుక మీద పుండు, నోట్లో పూతలు రావటం.- ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గిపోవటం. -జలదరింపు, తిమ్మిరి లాంటి లక్షణాలు కనిపించటం.-జుట్టు రాలిపోవడం, దృష్టి దోషం.-మానసిక సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల పర్యవేక్షణ తీసుకోవటం చాలా ముఖ్యం. 

*బి12 లోపం రానాట్టు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..! 

-మాంసాహారం తీసుకొనే వారువారానికి రెండు సార్లు చేపలు, కోడి-గుడ్డు, అన్ని రకాల మాంసాహారం తీసుకోండి. -ఆవు పాలు, పెరుగు, వెన్న, పన్నీర్ లాంటి డైరీ ప్రొడక్ట్స్ నియమంగా సేవించాలి. -సోయా, బ్లాక్ బీన్స్, గింజలు, పప్పు ధాన్యాలు, బఠాణీల్లో బి కాంప్లెక్స్ ఉంటాయి – కమల పళ్లు, అవకాడో, అరటి పండు, స్ట్రాబెర్రీ, కీవి, కర్బూజ, వాటర్ మెలన్, ఆపిల్, మామిడి పండ్లు పొద్దున్న టిఫిన్ కి ముందు తినవచ్చు. -టొమాటో, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారట్, క్యాబేజీ, పుట్ట-గొడుగు, ఆలూ, గుమ్మడి కూరగాయలు  వంటలలో వాడుకోవాలి.-ఆకుకూరల్లో మెంతి, గోంగూర, పొన్నగంటి పాలకూర లాంటివి పెసరు మొలకలు ప్రతి రోజూ వాడుకోవాలి.-బాదం పప్పు, వేరు శనగలు, పొద్దు తిరుగుడు పూల గింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్, ఖజ్జురం లాంటి డ్రై ఫ్రూట్ నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. 

వీటితో పాటు మంచి అలవాట్లు పెంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. పొద్దున్న,సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేసుకోవటం. రోజుకి  మూడు నుంచి నాలుగు లీటర్  మంచి నీళ్ళు/ పళ్ళ రసం త్రాగటం. ఎనిమిది గంటలు నిద్రపోవటం. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లూ మన జీవితంలో ఆనందం మరియు ఆరోగ్యం తీసుకొస్తాయి. 

Leave a Comment

error: Content is protected !!