ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కువ మంది పాటిస్తున్నది నీటి ఆవిరి పట్టుకోవడం. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటిసారి కంటే రెండవసారి దాని ప్రభావం ఎక్కువగా ఉంటూ అందరిని కలవరపెడుతోంది. ఈ కరోనా వల్ల ఆవిరి పట్టుకోవడం అనేది రోజువారిలో ఒక భాగం అయిపోతోంది. అయితే, ఆవిరి తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నిజంగా నశిస్తుందా?? అనేది చదవాల్సిందే.
రెండవ సారి కరోనా విజృంభన చూస్తున్నవారు వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ఇంటి నివారణలు మరియు ఆయుర్వేద పరిష్కారాలను అనుసరించడం ప్రారంభించారు. ఆయుర్వేదం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు వ్యాధులను అరికట్టడంలో ప్రజలకు సహాయపడుతుందని అందరికి తెలిసినదే. ప్రస్తుతం ఆయుర్వేద ప్రక్రియలోని కషాయలు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహధపడుతున్నాయి.
అయితే చాలామంది వైరస్ ఆలోచనలో ఒక తప్పు చేస్తున్నారు అదే ఆవిరి ప్రక్రియ అతిగా పాటించడం.
కరోనా యొక్క వ్యాప్తి సామాన్యులతో సహా మొత్తం పరిపాలనను దెబ్బతీసింది. వైరస్ సంక్రమణ కేసుతో పాటు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో, ఆవిరి పట్టుకోవడం గురించి మళ్ళీ విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఆవిరి వల్ల వైరస్ నశిస్తుందని చెబుతుంటే మరికొందరు అదే జరిగితే వైరస్ వ్యాప్తి ఎందుకు పెరుగుతోందని ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే, ప్రతి హాస్పిటల్ మరియు ప్రతి డాక్టర్ సూచిస్తున్నదాని ప్రకారం
ప్రతిరోజు కనీసం 5 నుండి 10 నిమిషాలు ఆవిరి పట్టడం అనేది శ్వాశ నాళ వ్యవస్థను సమర్థవంతంగా ఉంచడం మరియు శ్వాశ వ్యవస్థలో ఉన్న అడ్డంకులను తొలగించడం అనేది నిపుణుల అభిప్రాయం. శ్వాశ సమస్యలు గనుక ఇబ్బంది పెడుతున్నట్టు అయితే. రోజులో కనీసం మూడు నుండి నాలుగు సార్లు ఆవిరి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అయితే అతి ఏదైనా ప్రమాదమే. ప్రస్తుత సమయంలో పరిమితి మించి ఆవిరి తీసుకోవడం కూడా ప్రమాదకరమే. ఎక్కువగా వేడి నీటి ఆవిర్లు శ్వాశ నాళాలు, మరియు ఊపిరితిత్తుల గుండా ప్రయాణించడం వల్ల వాటి మీద ఉన్న పాక్షిక పొర దెబ్బతిని ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
నియమిత పరిమితిలో ఆవిరి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాశనాళం మొదలైన వ్యవస్థలో ఉన్న అడ్డంకులు తొలగించి శ్వాశ కు సుగమం చేసుకోవడం. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే సమస్య అంతా వైరస్ అనే భయంతో ఎప్పుడూ ఆవిరి పడుతూ, వేడి నీటి స్పర్శకు సున్నిత పొరలను గురిచేయడం వల్ల వాటి సున్నితత్వం కోల్పోయి అవి ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చివరగా…..
ఆవిరి పట్టడం ఆరోగ్యమైన అతిగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సున్నితత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ తప్పనిసరిగా ధరించి, సానిటైజటర్ వాడటం వీలైనంతవరకు సమూహాల్లో తిరగడం మనుకోవడం వంటి చర్యల వా మాత్రమే ఎవరిని వారు కాపాడుకోగలుగుతారు.