చింతపండు మనము వంటల్లో పులుపు కోసం తప్పక ఉపయోగిస్తాము. అయితే చింతపండు తీసాక ఆ విత్తనాలు అన్ని పడేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో ఉన్నవాళ్లు శేరు లెక్కన అమ్మేస్తుంటారు. అయితే ఈ చింతపండు విత్తనాలు గొప్ప ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగజేస్తాయి. మరి అవేమిటో చూడండి.
అతిసారం
చింతపండు విత్తనం పై పొట్టు అతిసారం గా పిలువబడే విరేచనాలను సమర్థవంతంగా నయం చేస్తుంది.
సౌందర్య మరియు ఔషధ ఉత్పత్తులలో
చింతపండు విత్తనాల సారం జిలోగ్లైకాన్‌లను కలిగి ఉంటుంది, దీనిని అనేక సౌందర్య మరియు ఔషధ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అలెర్జీగా వచ్చే చిన్న దద్దుర్ల చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు.
ఆర్థరైటిస్
చింతపండు విత్తనాలు కీళ్ల నొప్పులను తగ్గిస్థాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో ఎముకల మధ్య మోకాళ్ళ మధ్య గుజ్జు పెరగడంలో దోహాధం చేస్తుంది. ఒక టీస్పూన్ కాల్చిన చింతపండు విత్తన పొడిని రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి.
దంత సంరక్షణలో
చింతపండు విత్తనాల పొడిని చిగుళ్ళు మరియు దంతాలపై రుద్దాలి., బలహీనమైన దంతాలు ఉంటే. భారీ నికోటిన్ ఉన్న పదార్థాలు లేదా శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్ళ మీద పేరుకుపోయి గారను తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. టీ, కాఫీ, సోడా మరియు ధూమపానం వల్ల కలిగే మరకలను కూడా తొలగిస్తుంది.
చింతపండు విత్తనాలు దంతాలకు సంబంధించిన అన్ని సమస్యలను నయం చేయగలవు మరియు దంతాలకు అంటుకున్న నికోటిన్ ను తొలగించి శుభ్రంగా ఉంచుతాయి.
అజీర్ణ సమస్యకు
చింతపండు విత్తన రసం అజీర్ణాన్ని నయం చేయడానికి మరియు పిత్త ఉత్పత్తిని పెంచడానికి ఒక సహజ నివారణ. దీనిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు సహజంగా ఆకలి కలిగించడంలో తోడ్పడుతుంది. స్టోమాటిటిస్ చికిత్సకు మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
చింతపండు విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి అనేక రకాల వ్యాధులు మరియు రుగ్మతల నుండి రక్షిస్తాయి.
క్యాన్సర్
కాస్త జిగటగా ఉండే చింతపండు విత్తన రసం పెద్దప్రేగు క్యాన్సర్ కు ఉపశమనాన్ని అందించి కాన్సర్ ను నయం చేయడంలో తోడ్పడుతుంది.
యాంటీ బాక్టీరియల్
చింతపండు విత్తనంలో యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి న్యుమోనియా కలిగించే బ్యాక్టీరియా, టైఫస్ మరియు స్టెఫిలోకాకస్ ఆరియస్ నుండి రక్షిస్థాయి. ఇది చర్మ వ్యాధులతో పాటు పేగు మరియు మూత్ర మార్గము యొక్క అంటువ్యాధులకు కారణమయ్యే బాక్టీరియ నుండి కూడా రక్షిస్తుంది.
దగ్గు, టాన్సిల్స్ మరియు గొంతు ఇన్ఫెక్షన్
చింతపండు విత్తన రసంను నీటిలో కలిపి ఆ నీటితో నోరు కడగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి మాత్రమే కాకుండా టాన్సిల్స్, జలుబు, దగ్గు మరియు ఇతర గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.
చివరగా….
చింతపండు విత్తనాలు ప్రస్తుతం చాలా అరుదైపోతున్నాయి. వీటిని ఆన్లైన్ సైట్ లలో అమ్ముతున్నారు అంటే వీటి డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీదగ్గర చింతపండు విత్తనాలు ఉంటే అసలు పడేయకండి. జాగ్రత్తగా దాచండి.