సాధారణంగా అందరికీ మినప్పప్పు, శనగపప్పు వడలు మాత్రమే తెలుసు. మొలకెత్తిన గింజలు మరియు సెనగల కాంబినేషన్లో వడలు ఎవరికి తెలియదు. ఇది హై ప్రోటీన్ వడలు. ఇవి ఒబేసీటీ ఉన్నవాళ్లకి,కొలెస్ట్రాల్ ఉన్నవారికి, డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. ఎందుకంటే ఇడ్లీ, ఉప్మా, దోసలు వంటివి ఈ సమస్యలన్నీటికి కారణం. వడ అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అదే మొలకలు ఎత్తిన గింజలు శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరియు వీటి కోసం పైన పొట్టు తీయకుండా ఉపయోగించడం వలన ఇవన్నీ రక్తంలోకి గ్లూకోజ్ స్లోగా వెళ్ళేటట్లు చేస్తాయి.
ఈ వడలను నూనె వేసి వేయించుకుంటే ఇందులో ఉన్న పోషకాలు అన్ని కోల్పోతాము. అందువలన నూనె లేకుండా నాన్ స్టిక్ పాన్ అయినా గాని, మైక్రో ఓవెన్ లో అన్న గాని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. కానీ నూనె జోలికి మాత్రం వెళ్ళవద్దు. ఇప్పుడు శనగల మొలకల వడలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు. మొలకెత్తిన శనగలు ఒక కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, పాలకూర తురుము పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్.
మిగడ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. వీటి కోసం ముందుగా మెలకేత్తిన శనగలను ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క ముక్క లాగా మిక్సీ పట్టుకోవాలి. మల్ల కొంచెం పెరుగు వేసి మరల వడల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము, పాలకూర తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కొద్దిగా, మిగడ వేసుకొని మొత్తం మిశ్రమాన్ని ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ పొయ్యి మీద పెట్టుకొని దానిపై మీగడ వేసి వేడెక్కిన తర్వాత వడల పిండిని వడల మాదిరిగా ఓత్తుకొని సన్నని సెగపై కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొకవైపు తిప్పుకోవాలి. ఇలా సన్నని సగ పై కాలిస్తే వడలు బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇది హై ప్రోటీన్ వడలు కనుక ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు….