Tasty and Spicy Karappodi Recipe

టిఫిన్, అన్నం ఏది తిన్నా సరే ! రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం…

వెజిటేబుల్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నా వెజిటేబుల్ అరటికాయ. ఎక్కువ శక్తి ఇచ్చే వెజిటేబుల్ కూడా అరటికాయ. మిగిలిన కూరగాయలన్నింటిలోనూ 20-30% క్యాలరీల శక్తి ఉంటాయి.  కానీ అరటికాయలో మాత్రం 90% క్యాలరీల శక్తి ఉంటుంది. కానీ అరటికాయని పులుసులుగా, కూరలుగా, వేపుల్ల తినడం కంటే కారంపొడిగా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా అరటికాయను కారం పొడి చేసుకునే తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్ళవు. మరి అలాంటి హెల్తీ వే లో అరటికాయ కారంపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటికాయ కారం పొడి చేయడానికి కావలసిన పదార్థాలు.

                      ఏమిటి అంటే ముందుగా రెండు అరటికాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తొక్కను పలుచగా  తీసి  తురుముకోవాలి.   కారంపొడికి కావలసిన పదార్థాలు ఏమిటంటే వేరుశనగపప్పులు రెండు టేబుల్ స్పూన్లు, నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు ఒక  టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక  టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, మిరియాలు ఒక  టీ స్పూన్, జీలకర్ర ఒక  స్పూన్, మెంతులు ఒక టీ స్పూన్, ఆవాలు ఒక  టీ స్పూన్, ఎండు మిరపకాయలు మూడు, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ముందుగా అరటికాయ తొక్కను లైట్గా తీసుకోవాలి. తర్వాత అరటికాయలను తురుముకోవాలి.

                       దానిని ఒక నాన్ స్టిక్ పాన్ లో వేసి వెన్న రాసి అరటికాయ తురుము మాడిపోకుండా లైట్ గా వేపుకుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత కారంపొడి కి తాలింపు సిద్ధం చేసుకోవాలి ముందుగా పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, కాస్త నువ్వులు కరివేపాకు, వేరుశనగ పప్పులు ఇలా అన్నింటిని వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన అన్నింటిని చల్లారిన తర్వాత కారప్పొడికి సంబంధించిన వీటి అన్నిటిని  ముందుగా మిక్సీ జార్ లో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పొడిలో అరటికాయ తురుము మిక్సీ జార్ లో వేసి మెత్తగా కారప్పొడిలా చేసుకోవాలి.

                        కూరగాయలతో కారంపొడులు పెద్దగా ఎవరూ చేసుకోరు. ఎందుకు అంటే అవి అంత రుచిగా ఉండవు. కానీ ఈ అరటికాయ కారప్పొడి మాత్రం అలా కాకుండా కొంచెం స్పెషల్ గా అంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనిని భోజనంలో గాని, టిఫిన్స్ లో గాని పుష్కలంగా వాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!