Tasty Barley Payasam Recipe Fiber and Protein Rich Payasam

బార్లీ గింజల పొడితో తయారుచేసిన అమృత సమానమైన పాయసం….

 బార్లీ అనేది మన ఆరోగ్యానికి చాలా చక్కగా తోడ్పడుతుంది. చాలామంది ఒంట్లో నీరు ఎక్కువ పెరిగిపోయి బరువు పెరగడం గాని, బీపీ పెరగడం గాని, ఇక కాళ్ల వాపులు ముఖం ఉబ్బడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఆ నీటిని ఎక్కువగా పేర్కొన్న దానిని బయటకు పంపడానికి బార్లీ నాచురల్ లైట్ లా ఉపయోగపడుతుంది. బియ్యంతో పాయసం చేసుకుంటే లాభాలు ఏమీ ఉండవు అదే బార్లీతో చేసుకుంటే టేస్ట్ తో పాటు బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి హెల్త్ పాయసం పంచదార వాడకుండా, బెల్లం వాడకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బార్లీ పాయసం పొడి విధానం.

                కావలసిన పదార్థాలు ముందుగా ఒక కప్పు బార్లీ గింజలు, ఒక లీటరు పాలు, అర కప్పు తేనె, అర కప్పు పూల్ మఖాన గింజలు, జీడిపప్పు పావు కప్పు, పుచ్చ గింజల పప్పు పావు కప్పు, బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్, పిస్తా పప్పులు 2 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలకుల నాలుగు. ముందుగా బార్లీ గింజలను కడిగి ఆరబెట్టాలి తర్వాత ఒక నాన్ స్టిక్ పాత్రలో జీడిపప్పు ముక్కలు, బొచ్చ గింజల పప్పును వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా వేపించిన వాటిని పక్కన పెట్టుకుని బాదం పప్పులను కూడా దోరగా వేయించుకోవాలి. పిస్తాలు, పూల్మాఖాన గింజలు, సోంపు, యాలికలు వీటన్నిటిని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

                     కడిగి తయారిన బార్లీ గింజలను కూడా దోరగా వేయించుకుని మిక్సీ జార్ లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు, సోంపు, పుచ్చ పప్పు, యాలికలు అన్ని వేసి మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. బార్లీ పొడికి ఈ డ్రైనేజ్ పొడి కూడా కలుపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ బార్లీ గింజల పొడిని 2 స్పూన్స్ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసి మరిగించుకోవాలి తరువాత ఈ పొడిని దానిలో వేసి ఉడికించాలి.

స్టవ్ ఆఫ్ చేసిచల్లారిన తర్వాత దానిలో తేనె కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ బార్లీ గింజల పాయసాన్ని చిన్నపిల్లలకు ఆహారంగా పెట్టవచ్చు.

                     ఇలా బార్లీ గింజల పాయసాన్ని తీపి ఎక్కువగా ఉంటే పాయసంలో కూడా తాగొచ్చు.

Leave a Comment

error: Content is protected !!