సాధారణంగా పన్నీర్ అంటే చప్పగా ఉండి, కమ్మగా ఉంటుంది. కానీ దీనికి కొంచెం మసాలా జోడిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. కానీ ఇటువంటి పన్నీరును ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలి అన్న, షుగర్ బాగా తగ్గాలి అన్న పన్నీరు ఎక్కువగా తింటే అందులో ప్రోటీన్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల త్వరగా ప్రతిఫలం లభిస్తుంది అని పన్నీర్ డైట్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కానీ రోజు పన్నీర్ తింటే బోర్ కొడుతుంది. అలాంటి పన్నీర్ని స్పెషల్ గా మసాలా పెట్టి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ మసాలా పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పాలు రెండు లీటర్లు, క్యాబేజీ ముక్కలు హాఫ్ కప్పు, క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు, క్యాప్సికం ముక్కలు హాఫ్ కప్, టమాటా సాస్ రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, ఓరిగానో వన్ టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, అల్లం పేస్టు ఒక టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయ చెక్క ముక్క ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మీగడ కొద్దిగా, ముందుగా మసాలా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసుకుని అందులో జీలకర్ర, ఎండుమిరప చెక్క ముక్క పొడి, ఓరిగానో, పచ్చిమిరప పేస్టు, కొత్తిమీర, అల్లం తురుము ఇవన్నీ పాలలో వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి పాలు విరిగేటట్టు చేయాలి. పాలు విరిగిన తర్వాత పాలు విరిగుడిని వడకడితే మసాలా పన్నీర్ తయారవుతుంది. ఈ పన్నీర్ కొద్దిగా చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రలో మీగడ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత టమాటా సాస్ కొద్దిగా వేయాలి.
దీని వలన ఉప్పులేని లోటు తెలియదు. ఆ తర్వాత పన్నీరు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చీల్లి మసాలా పన్నీర్ తయారవుతుంది. దీని ఇంట్లో స్పెషల్ గా తయారు చేసుకోవచ్చు…. ఇది హై ప్రోటీన్ ఫుడ్.