కంద వాతం చేస్తుంది అని చాలామంది వంటల్లో ఉపయోగించారు. ఒకవేళ వండుకున్న కూరలు లేదా పులుసులు వండుకుంటారు. కంద మనకు సంవత్సరం అంతా లభిస్తుంది. మామూలుగా దుంపలను పులుసులో కూరలు కాకుండా ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు. కానీ మనకు కంద దుంప ఫ్రై ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నూనె, ఉప్పు లేకుండా కంద దుంప ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా ఉంటుంది. మనం వండుకునే పద్ధతి బట్టి దాని ప్రభావం కూడా మారుతుంది.
ఇప్పుడు మనం చేసుకునే విధంగా కంద ఫ్రై చేస్తే దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాతం నొప్పులు గాని, ఎలర్జీలు, దురదలు వంటివి గాని ఉండవు. ఇప్పుడు కంద ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది సన్నగా కోసిన కంద ముక్కలు ఒక కప్పు, పుట్నాల పప్పు పొడి రెండు స్పూన్లు, వేపించిన నువ్వులు ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు, తేనె ఒక స్పూన్, జీలకర్ర పొడి ఒక స్పూన్, ఎర్ర కారం పొడి ఒక స్పూన్, మీగడ ఒక స్పూన్, పసుపు సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు కంద ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకొని అందులో ఒక స్పూన్ తేనె వేయాలి. మరియు కొద్దిగా పసుపు వేసి మూడింటిని బాగా కలిపి అందులో కంద ముక్కలను వేయాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆవిరిపై ఉడికించుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడికించకూడదు కేవలం 70% మాత్రమే ఉడికించాలి. ఇలాగైతే ముక్క విడిపోదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ మీగడ వేసి ఇది మరిగిన తర్వాత ఇందులో ఉడికించిన కంద ముక్కలను వేయాలి.
ఇది నాలుగైదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. పుట్నాల పప్పు పొడి వేసుకుంటే ఫ్రై లో ఉన్న తేమ పీల్చివేసి ఫ్రై క్రిస్పీగా ఉండేలాగా చేస్తుంది. తర్వాత వేపించిన నువ్వులు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి. టేస్టీ, క్రిస్పీ కంద ఫ్రై తయారైపోయింది…