హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పొట్టు పెసరపప్పు తో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇది రోటీ లోకి నాని లోకి పుల్కా లోకి అలాగే అన్నంలోకి అన్ని బ్రేక్ ఫాస్ట్ లో కి చాలా బాగా ఉంటుంది. పూర్తి రెసిపీ కొరకు ఈ కింది వీడియో చుడండి ..
కావలసిన పదార్థాలు
- 100 గ్రాములు పొట్టు పెసలు
- 3 మీడియం సైజు టమోటాలు
- 4 పచ్చిమిరపకాయలు
- 1 పెద్ద సైజు ఉల్లిపాయ
- రెండు టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 tsp కారం పొడి, 1 tsp ధనియాల పొడి , 1/2 tsp పసుపు
- పోపుదినుసులు
- కరివేపాకు
- 1 స్పూన్ నెయ్యి
- కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం
- ముందుగా పొట్టు పెసలు బాగా కడిగి నాలుగు గంటల పాటు నానపెట్టండి.
- నానిన పెసరపప్పును ఒక కుక్కర్ లో వేసి ఒక గ్లాసు నీటిని పోసి, రుచికి తగ్గట్టు గా కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి.
- మిక్సీ జార్ తీసుకొని అందులో టమోటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసి మెత్తని పేస్టులా ప్యూరిలా చేసుకోండి.
- స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. అర టీస్పూన్ ఆవాలు, అర టీ స్పూను మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుడిచివేసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇందులో వేయండి. కొద్దిగా కరివేపాకు వెయ్యండి. అన్నింటినీ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.
- తర్వాత ఇందులో పసుపు ఒక టీ స్పూన్, కారంపూడి ఒక టీస్పూన్, ధనియాలపొడి ఒక టీ స్పూన్ వేసి , కొద్దిగా నీటిని వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు ఫ్రై చేయండి.
- ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి ప్యూరీని ఇందులో వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకూ ఒక నాలుగు నిమిషాలు వేయించండి.
- ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేయండి. అన్నింటిని బాగా కలపండి. తర్వాత ఇందులో అర టీస్పూన్ గరం మసాలా వేయండి. అన్నింటినీ ఒక ఐదు నిమిషాలు ఉడికించండి. చివరిగా ఇందులో ఒక టీ స్పూను నెయ్యి వేయండి. సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీరను వేయండి.

ఎంతో రుచికరమైన పొట్టు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మూంగ్ దాల్ కర్రీ , దాల్ తడ్కా అని కూడా అంటారు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలకు మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.