tea or coffee is good for health

టీ మరియు కాఫీ ఇందులో ఏది మంచిది?

మన ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తగేదేంటో తెలుసా? ఆల్కహాల్ కాదు. టీ మరియు కాఫీ. మనలో కొంతమంది ఎర్లీ మార్నింగ్  టీ కానీ కాఫీ గానీ తాగకుండా ఏపని చేయలేరు. అయితే చాలామంది టీ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండదని, దీనిద్వారా ఆహారం తినకపోతే హెల్త్  ప్రాబ్లమ్స్ వస్తాయని,  అనేక రోగాలు వస్తాయని అంటూ ఉంటారు. కొంతమంది టీ మంచిదని మరికొంతమంది కాఫీ మంచిదికాదని అంటూ ఉంటారు.

అసలు టీ మంచిదా కాఫీ మంచిదా?  ఏది తాగితే మంచిది?

టీ మరియు కాఫీ అనేవి మన దేశానికి సంబంధించినవి కావు.  టీ అనేది బ్రిటిష్ వాళ్ళ వల్ల మన దేశానికి 1836లో వచ్చింది. వాళ్ళని చూసి మనం టీ తాగడం నేర్చుకున్నాము.  అయితే కాఫీ, టీ కంటే ముందు వచ్చింది. 1670 లో ఈస్టిండియా కంపెనీ వల్ల మన ఇండియాలో కాఫీ వచ్చింది. సైన్స్ ప్రకారం టీలో ఆల్కహాల్ ఉండదు.  అంతేకాకుండా . సైంటిఫిక్ రీసెర్చ్  ప్రకారం ఇందులో ఏ విధమైన added flavors ఉండవు కాబట్టి హానికరం కాదు. ఈ కాఫీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

టీలో చాలా రకాలున్నాయి. బ్లాక్ టీ,  వైట్ టీ, ఎల్లో టీ, గ్రీన్ టీ ఇలా చాలా రకాలు ఉన్నాయి..  వీటన్నింటిలో  యాంటీ ఆక్సిడెంట్స్  ఎక్కువగా ఉండడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మనకు డయాబెటీస్, హార్ట్ఎటాక్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా టీ బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

బ్లాక్ టీ కి ఉన్న తేడా ఏంటి?

గ్రీన్ టీ అనేది బరువు తగ్గడానికి  చాలా మంచిదని మనం చాలా వాణిజ్య ప్రకటనలు చూస్తూ ఉంటాం. అయితే బ్లాక్ టీ కి, గ్రీన్ టీ కి ఉన్న తేడా ఒకటే. బ్లాక్ టీ అనేది fermented(పులియబెట్టిన టీ). దీనివల్ల గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాఫీలో కూడా మనకు చాలా రకాలున్నాయి. బ్లాక్ కాఫీ, గ్రీన్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, నార్మల్ కాఫీ ఇలా చాలా కాఫీలు ఉన్నాయి. మనం కాఫీ తాగడం వల్ల క్యాన్సర్, డయాబెటీస్  వచ్చే అవకాశం చాలా తక్కువ.

గ్రీన్ కాఫీకి రెగ్యులర్ కాఫీ కి ఉన్న తేడా ఏంటి?

నార్మల్ కాఫీ బీన్స్ మనకు రోస్టెడ్ బీన్స్. గ్రీన్ కాఫీ బీన్స్ roasted కాదు. గ్రీన్ కాఫీ బీన్స్ లో ఎక్కువగా chlorogenic యాసిడ్స్ ఉండటం వల్ల గ్రీన్ కాఫీ మన హెల్త్ కు చాలా మంచిది.

టీ కాఫీ అనేది ఎక్కువగా తాగకూడదు అవి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ అనే కెమికల్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీ లో టానిన్ (tannin) అనే కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఈ కెమికల్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటివల్ల మన ఐరన్ శాతం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ టైం కెమికల్ వల్ల మన పళ్ళకు హాని జరిగే అవకాశం ఉంటుంది.  ఎవరైతే టీ ఎక్కువగా తాగుతారో వాళ్ళ పళ్ళను  గమనించినట్లయితే అవి  చాలా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మన హార్ట్ రేట్ మరియి బీపీ కూడా పెరుగుతుంది. బోన్స్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనకు కీళ్ల వాతం కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాఫీ అనేది ఒక ఎడిట్ ఒక అడిక్షన్.  అందుకే చాలా మంది ఉదయం పోకుండా ఉండలేరు ఒక్కసారి అలవాటైతే మానడం చాలా  కష్టం.

కాఫీ టీలు ఎక్కువగా తాగడం అనారోగ్యానికి కారణం. కాబట్టి మరి ఎంత తాగాలి?

సైన్స్ రీసెర్చ్ ప్రకారం కాఫీ టీలు రోజుకి రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తాగాలి.  అయితే ఉదయాన్నే పరగడుపున  టీకానీ,  కాఫీ కానీ తాగకూడదు. మనం ఎప్పుడైనా ఏదైనా తిన్న తరువాత 30 నిమిషాల తరువాత టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. సాయంత్రం ఐదు తర్వాత  టీలు కాఫీలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే అది మన నిద్రను పాడు చేస్తుంది. సైన్సు ప్రకారం మనం  కాఫీలు టీలు లిమిటెడ్ గా తాగడం వల్ల ఎలాంటి  హెల్త్ ఇష్యూలు రావు. వీటిలో మనం షుగర్ ఎక్కువగా వేసుకోకూడదు. కాఫీ కి ఎక్కువగా అడిక్ట్ కనుక కాఫీ కంటే టీ మంచిది ఎందుకంటే కాఫీ లో కెఫెన్ అనే కెమికల్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!