ఇటీవలి కాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతున్నారు. గార పట్టిన పంటిలో బ్యాక్టీరియా నివాసం ఉండి నోటిలో ఉన్న తీపి పదార్థాలు వాటి వల్ల ఏర్పడే ఆసిడ్స్ వల్ల కూడా మన పంటిపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఈ ఎనామిల్ పాడవడంవల్లే నోటిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి పంటి నొప్పి కలుగుతుంది. పంటినొప్పి సాధారణమైనది అయినా ఇది భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. ఇలాంటి నొప్పులు తగ్గించుకునే కొన్ని ఆయుర్వేద రెమెడీస్ గురించి తెలుసుకుందాం.
ఈ రెమిడీ తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకోండి
- అందులో ఒక పావు స్పూన్ ఉప్పును కలపండి
- ఇందులో ఒక చిటికెడు పసుపు కలపండి
- తరువాత ఇందులో ఆవనూనె ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ మోతాదులో కలపండి.
- ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయండి.
ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్ తో లేదా చేత్తో కొద్దిగా తీసుకొని మీ పంటి నొప్పి పెడుతున్న ప్రదేశంలో లో అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత వేడి నీటితో నోటిని పుక్కిలించాలి. ఇలా చేస్తూ ఉంటే మీ పంటి నొప్పి నిమిషాల్లో తగ్గుతుంది.
పసుపు మరియు ఉప్పు లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా మీ పంటి నొప్పి తో పాటు మీ నోటిలోని బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తాయి. ఆవనూనెలో యాంటీఆక్సిడెంట్స్ యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన దంతాలు లోని కమిటీలను నొప్పిని నివారిస్తాయి
అలాగే పంటి నొప్పితో బాధపడే వారు జామ ఆకులను కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే జామ ఆకుల యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రెండు లేదా మూడు జామ ఆకులను బాగా కడిగి పేస్టులా తయారుచేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే మీ పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
పంటి నొప్పితో బాధపడుతున్న వారికి అల్లం ఒక మంచి హోమ్ రెమిడి. ఇది కూడా మీ దంతాల నొప్పి నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఒక అల్లం ముక్కను శుభ్రంగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నోట్లో వేసుకుని బాగా నమలండి. ఇలా చేస్తుంటే మీ పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.