పళ్ళవరస అందంగా ఉండడంతో పాటు అవి తెల్లగా ఉంటే ముఖానికే వన్నె తెస్తాయి. కానీ మనం తినే ఆహారపు పదార్థాలు, కూల్డ్రింక్స్ అధికంగా తాగే అలవాట్లు, అందులో ఉండే రసాయనాల వలన పళ్ళ మీద ఎనామిల్ కలర్ మారిపోతుంది. ఇవి పసుపుపచ్చగా తయారయి చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఇక కొంతమంది పాన్ లు, గుట్కాలు తినడం వలన పళ్ళు పసుపురంగులోకి మారుతాయి.
పళ్ళు తెల్లగా మారడం కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు అన్నీ మన ఇంట్లోనే ఉండేవి. వీటితో చిన్న చిట్కా చేయడం వలన పళ్ళు తెల్లగా మారడంతో పాటు అందంగా కనిపిస్తాయి. కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే పళ్ళు తెల్లబడటం మీరు చూడొచ్చు. మీ పసుపు పచ్చని పళ్ళు సహజంగా ఎలా తెల్లగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
కావలసినవి
వెల్లుల్లి
– టొమాటోస్
– టూత్‌పేస్ట్
-సోడియం బైకార్బోనే (బేకింగ్ సోడా)
ఎలా చెయ్యాలి
వెల్లుల్లిని వలిచి పైన పొట్టు తీయండి తర్వాత మెత్తగా దంచుకోవాలి.తర్వాత టొమాటోను ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూన్ రసం తీసుకోవాలి. దీనిని వెల్లుల్లి పేస్ట్ లో వేయాలి. దీంట్లో రోజూ మీరు పళ్ళకోసం వాడేంత కోల్గేట్ టూత్‌పేస్ట్‌ను జోడించండి. కోల్గెట్ కాకపోయినా తెల్లగా ఉండే పేస్ట్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడాని కూడా ఒక చెంచాడు వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
ఎలా ఉపయోగించాలి
మీ పళ్ళను ఈ మిశ్రమంతో 3 నుండి 5 నిమిషాలు బాగా రుద్దండి. మొదటిసారే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ మిశ్రమాన్ని ఇలా క్రమం తప్పకుండా వాడడం వలన కొన్ని రోజుల్లోనే అందమైన పళ్ళను సొంతం చేసుకుంటారు.
వెల్లుల్లిలో అందరికీ బాగా తెలిసిన సమ్మేళనాలలో ఒకటి అల్లిసిన్, ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది పంటి నొప్పితో సంబంధం ఉన్న కొన్ని బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. అల్లిసిన్ అనే రసాయనం దంచిన తర్వాత లేదా కత్తిరించిన తర్వాత తాజా వెల్లుల్లిపాయలో లభిస్తుంది. దీనిని వాడడం వలన పంటిపై ఏర్పడే మచ్చలు మరకలను తొలగిస్తుంది.
బేకింగ్ సోడాలో సహజమైన తెల్లబరిచే లక్షణాలు ఉన్నాయి, అందుకే ఇది వాణిజ్య టూత్‌పేస్ట్‌లో ప్రసిద్ధ పదార్థం. దీనితో తేలికపాటి రాపిడి కలిగించడం వలన ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బేకింగ్ సోడా మీ నోటిలో ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది, ఇది బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది.