tella galijeru punarnava plant uses

అద్భుతమైన ఈ ఆకు ఎక్కడైనా కనబడితే అస్సలు వదలకండి

తెల్లగలిజేరు దీన్ని సంస్కృతంలో పునర్నవ అని అంటారు. పునర్నవ అంటే మళ్ళీ కొత్తగా సృష్టించేది అని అర్థం. శరీరంలో దెబ్బతిన్న ఏ అవయవం ను అయినా మళ్ళీ పునరుద్ధరిస్తుంది అందుకే పునర్నవ అనే పేరు వచ్చిందని ఒక ఉవాచ. ఈ పునర్నవ ఆకు పంటపొలాలలోను, దారులకు ఇరువైపులా, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. దీనిని ఆకుకూర లాగా పప్పు వండుకుని తింటారు. ఇంకా పొడికూర లాగా కూడా కొన్ని ప్రాంతాల్లో తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజు వారీ ఆహారం లో ఈ తెల్లగలిజేరు ఆకు వారంలో కనీసం  మూడు సార్లు అయినా వాడుతుంటారు. అటువంటి ఈ ఆకు కేవలం ఆకుకూరగా మాత్రమే కాదు బోలెడు ఔషధ గుణాలతో జీవితానికి గొప్ప మేలు చేకూరుస్తుంది. ఇంతకీ అవేంటో చూద్దాం.

తెల్లగలిజేరు శరీరానికి చలువను  చేకూర్చి అధిక వేడిని నిర్మూలిస్తుంది.  ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ ఔషధాలు కలిగిన మొక్క. ఈ మొక్కను ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల బోలెడు జబ్బులను నయం చేసుకోవచ్చు. అయితే ఏ సమస్యకు ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం.

మొలల వ్యాధికి 

కఫము, వాతము ఎక్కువగా ఉన్నపుడు మలబద్దకం కలిగినపుడు మొలల వ్యాధితో బాధపడుతున్నపుడు, ఒంట్లో నీరు చేరినప్పుడు తెల్లగలిజేరు ను కూరలాగా వండుకుని తినడం వల్ల సమస్యలు తొందరగా నయమవుతాయి. 

మూత్రాశయం లో రాళ్లకు

తెల్లగలిజేరు వేళ్ళను దంచి  నీటిలో వేసి మరగబెట్టి కషాయం లా తయారుచెయ్యాలి. ఈ కషాయాన్ని పూటకు ఔన్స్ మోతాదుగా రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రాశయం లో రాళ్లు కరిగిపోతాయి.

ఉబ్బస రోగం కు

తెల్లగలిజేరు కషాయంలో 20 గ్రాముల అల్లం రసం కలిపి పూటకు ఔన్స్ మోతాదుగా తీసుకుంటే క్రమంగా ఉబ్బసరోగం తగ్గిపోతుంది.

జ్వరాలకు

తెల్లగలిజేరు రసం, పాలు, నీళ్లు మూడు సమానబాగాలు గా తీసుకుని మరిగించి పాల వంతు మాత్రమే మిగిలిన తరువాత దించి గోరువెచ్చగా ఉన్నపుడు తాగాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి జ్వరాలు అయినా  తగ్గిపోతాయి.

బోధకాలు కు

తెల్లగలిజేరు ఆకును కచ్చాపచ్చగా దంచి ఆముదంలో వేయించి భరించగల వేడి ఉన్నపుడు బోధకాలు మీద వేసి కట్టు కట్టడం వల్ల  మెల్లిగా తగ్గుముఖం పడుతుంది.

దగ్గులకు

తెల్లగలిజేరు ఆకుల రసం, మిరియాల చూర్ణం సమానంగా కలిపి పూటకు 5 గ్రాముల మొత్తంలో తీసుకోవాలి. దీనివల్ల మొండి దగ్గులు కూడా సులువుగా తగ్గిపోతాయి.

అనిమియాకు

తెల్లగలిజేరు రసం లేదా చూర్ణం ను పలుచటి మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల అనిమియా తగ్గిపోతుంది. అయితే ఈ పద్దతిని క్రమం తప్పకుండా 90 రోజుల పాటు వాడాలి.  అనిమియా తగ్గడానికి వేల కొద్ది మందులు  వాడక్కర్లేదు. తెల్లగలిజేరు చాలు.

మధుమేహం తగ్గడానికి

తెల్లగలిజేరు ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల  శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెంచుతుంది.  దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి తోడ్పడి మధుమేహాన్ని క్రమబద్దీకరిస్తుంది. క్లోమ గ్రంధిలో బీటా కణాలను తిరిగి ఉత్పత్తి చేయడం ద్వారా కూడా రక్తంలో చెక్కెరలను అదుపులో ఉంచి మధుమేహా స్థాయిలను అదుపు చేస్తుంది.

చివరగా….

ఎలాంటి డబ్బు పెట్టకుండానే గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తెల్లగలిజేరు ను ఆహారం లో భాగం గానూ మరియు మనకున్న జబ్బులకు పైన సూచించిన విధంగానూ వాడటం వల్ల గొప్ప ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకే ఈ తెల్లగలిజేరు కేవలం ఆకుల నుండి వేర్ల వరకు సమస్తము మన సమస్త దేహానికి అద్భుతమైన కానుక.

Leave a Comment

error: Content is protected !!