అప్పుడప్పుడు కొందరికి పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పానిక్ ఎటాక్ ఏమిటి అంటే అతి సంతోషం కలిగినప్పుడు, అతి కోపం వచ్చినప్పుడు, అతిగా భయం కలిగినప్పుడు మానసిక స్థితి అయోమయంగా అయిపోతుంది, ఒక్కసారే ఎక్కువై పోతుంది. ఈ అయోమయ స్థితి వచ్చినప్పుడే నియంత్రణ కోల్పోయి కాస్త పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటనే చమటలు పట్టేస్తాయి, శ్వాస సరిగా అందదు, కళ్ళు తిరుగుతుంటాయి, కొంతమంది సడన్ గా పడిపోతారు, వంతింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి షివరింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ ఉంటుంది.
ఒక్కోసారి ఇరిటేషన్ కూడా బాగా ఉంటుంది. అంటే లాస్ ఆఫ్ బాడీ కంట్రోల్ మెయిన్ గా జరుగుతుంది. ఈ పానిక్ ఎటాక్ వచ్చిన వారికి వెంటనే ఖాళీ ప్రదేశంలో పెట్టాలి, లైట్స్ ఆపేయాలి, ఏ విషయాన్ని అలా షాక్ అయ్యారో ఆ విషయాలను వాళ్ళ దగ్గర ప్రస్తావించ కూడదు. డిస్టబెన్స్ లేకుండా శబ్దాలు లేకుండా చూసుకోవాలి. చెస్ట్ పెయిన్ చెమటలు తగ్గాక వాళ్లు నార్మల్ స్టేజ్ కి వచ్చాక వాళ్లకి కొబ్బరి నీళ్లు గాని, నిమ్మకాయ తేనె కలిపిన నీటిని గాని ఇవ్వాలి. కాస్త మంచినీళ్లు తగించడమో, కాస్త చల్లని నీటితో ముఖాన్ని కడిగించడం చేయాలి. వాళ్లకు కంగారు పడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండడానికి కాస్త పాజిటివ్ గా మాట్లాడి ఓదార్చి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళని సముదాయించాలి.
వాళ్ళను శాంత పరచాలి. ఇలా చేస్తే శరీరం మొత్తం 5-10 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పక్కనే ఉండి ధైర్యాన్ని చెప్పి వాళ్లని సముదాయిస్తే వెంటనే నార్మల్ స్థితికి రాగలరు. కొంత మందికి సైకలాజికల్ గా జనాలు ఎక్కువగా గుంపులుగా ఉన్నప్పుడు వాళ్లకి పానిక్ ఎటాక్ వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇలా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లు హోమియో మెడిసిన్ వాడడం మంచిది. ఇలా అతి భయం అతి కోపం అది సంతోషం వచ్చేవాళ్ళు మాత్రం రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాణాయామం చేయడం చాలా మంచిది. పాజిటివ్ థింకింగ్ లో ఉండడం. సిలీనీయం ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే బ్రెజిల్ నట్స్ ఇది బాగా పని చేస్తాయి.
అలాగే ఫ్రూట్స్ నట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల్లో సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. నలుగురు హ్యాపీగా ఉంటే డోపామిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అవుతుంది. దీనివల్ల పానిక్ ఎటాక్ రాకుండా ఉంటాయి.