telugu miracle viral news latest

బ్రతికి ఉండగానే ఈ మహిళను సజీవ సమాధి చేశారు తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ముప్పై ఏళ్ల నల్లజాతి మహిళ ఎస్సీ డన్‌బార్‌కు  ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేరింది అక్కడ చేరిన కొన్ని రోజులకే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని ఒక చెక్క శవపేటికలో ఉంచారు మరియు పొరుగు పట్టణంలో నివసించే డన్బార్ సోదరి చూడడం కోసం ఉదయం పదకొండు గంటలకు అంత్యక్రియలు ఏర్పాటు చేయబడ్డాయి.  చాలా సేపు ఎదురు చూసిన సోదరి ఇంకా రాలేదు దాంతో ఎస్సీ డన్బార్కు అంత్యక్రియలు పూర్తి చేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె సోదరి వచ్చింది. అయితే ఆమె చివరిసారిగా ఎస్సీని చూసేందుకు శవపేటికను త్రవ్వడానికి మతాధికారులు ఒప్పుకున్నారు. 

 అయితే స్క్రూలు తొలగించి, శవపేటిక మూత తెరవగానే, ఎస్సీ తన శవపేటికలో కూర్చుని తన సోదరిని చూసి నవ్వింది. ముగ్గురు వ్యక్తులు సమాధిలోకి వెనుకకు పడిపోయారు, మిగిలిన ఇద్దరు బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పుడు అతనిని తొక్కడంతో మూడు పక్కటెముకలు విరిగిపోయాయి. ఎస్సీ సోదరితో సహా దుఃఖిస్తున్నవారు ఆమెను దెయ్యం అని నమ్మి, అరుస్తూ పారిపోయారు.  సమాధిపై నుంచి పైకి ఎక్కిన ఎస్సీ తమను వెంబడించడం చూసిన వారంతా ఉన్మాద స్థితిలో పట్టణంలోకి దూసుకెళ్లారు. డన్‌బార్‌ను చుట్టుపక్కల వారు అనుమానంతో చూసేవారు.  ఆమె మరణం నుండి తిరిగి వచ్చిన ఒక దెయ్యం అని పుకార్లు ఉన్నాయి. అయితే చనిపోయి‌ బ్రతికిన ఎస్సీ తర్వాత నలభై ఏడు సంవత్సరాల పాటు బ్రతికే ఉంది.

 తర్వాత ఇంగ్లాండ్ కు చెందిన జార్జియా అనే వ్యక్తి గర్భవతిగా ఉన్నప్పుడు మూర్ఛ వ్యాధితో చనిపోయింది. డాక్టర్లు కూడా ఆమె చనిపోయినట్టు నిర్ధారించడంతో ఆమెను కెఫిన్ బాక్స్లో పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కొంత సేపటికి ఆమెకు మెలకువ రావడం ఆమె బాక్స్ ను గట్టిగా ఉండడంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బహుశా ఆమె బ్రతికి ఉండవచ్చు అని అనుమానంతో ఆమెను బయటకు తీశారు. కెఫిన్ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఆమె కళ్ళు తెరిచి ఉండడం గమనించి గుండె కూడా కొట్టుకుంటున్నట్టు గమనించి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే ఆమె అప్పటికే స్పృహతప్పి ఉంది. డాక్టర్లు పరీక్షించి ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు గుర్తించారు. అయితే కడుపులో ఉన్న బిడ్డను రక్షించడం కోసం ఆమెను వెంటిలేటర్పై పెట్టారు. అలాగే ఆమెకు తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన కొన్ని క్షణాల్లోనే జార్జియా చనిపోయింది. అప్పటివరకు ఆమె బ్రతికి ఉండడం వింతగా చెబుతుంటారు.

 తరువాత ఒక తాగుబోతు షూ మేకర్ గురించి చెప్పుకోవాలి. ఒకరోజు అతడు పనిచేసుకునే చోట అచేతనంగా పడి ఉండడం చూసి కొంతమంది అంబులెన్స్ కి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. అతడి శరీరంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అతడు మరణించినట్టు నిర్ధారించి అతడిని బాక్స్లో పెట్టి పూడ్చేశారు. అలా పూడ్చి పెట్టిన తరువాత కొంత సేపటికి అతడికి మెలకువ వచ్చింది. ఎక్కడ ఉన్నాడో గమనించి ఆ బాక్స్ ని కొట్టడం మొదలు పెట్టాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ రోజంతా అలానే ఉన్నాడు. మరుసటి రోజు అటు వైపు వస్తున్న వ్యక్తులకు శబ్దం వినిపించడంతో పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బ్రతికి ఉన్న వారిని పూడ్చిపెట్టారేమోనని అనుమానంతో తవ్వి చూడగా అతడు కొనఊపిరితో ఉన్నాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లినా అతడు బ్రతకలేదు. అతడిని షూ మేకర్ ద బాడ్ లక్ గై అని చెబుతారు.

Leave a Comment

error: Content is protected !!