మహిళలలో కొన్ని సమస్యలు ఉన్నట్టే పురుషులలో కూడా ఉంటాయి. మహిళల సమస్యలకు పరిష్కారాలు ఉన్నంత విరివిగా పురుషుల సమస్యలకు ఉండటం లేదనేది వాస్తవం. పురుషుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య వృషణాలలో వాపు మరియు నొప్పి రావడం. వీటికి కారణాలు అన్వేషిస్తే ఎక్కువ ప్రయాణం చేసినపుడు, ఎక్కువ అలసిపోయినపుడు, వృషణాలలో నొప్పి వస్తూ ఉంటుంది. ఒకోసారి లైంగిక వాంఛను తీర్చుకునే అవకాశం లేక అతిగా నిగెర్శించుకోవడం వలన కూడా వృషణాలలో నొప్పి, వాపు రావచ్చు. ఇవే కాకుండా ఇంకా అనేక కారణాలు ఉన్నాయి కూడా. అయితే ఈ వృషణాల నొప్పి మరియు వాపు తగ్గించుకోవడానికి సులువైన చిట్కాలు ఉన్నాయ్ అవేంటో చూడాల్సిందే మరి.
◆ గచ్ఛ కాయకు వృషణాలలో వాపు, నొప్పి జ్వరం వీటిని తగ్గించే గుణం ఉంది, గచ్ఛకాయలు పై బెరడు పగలగొట్టి, లోపలి పప్పు తీసి, సానమీద అరగదీసి, ఆ గంధాన్ని వాచిన ప్రాంతంలో రాసి పట్టి లాగా వేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, పొటు, వాపు తగ్గుతాయి.
◆ దురదగొండి మొక్కలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్కను పీకి వేరును తీసుకుని బాగా కడిగి ఆ వేరును సానమీద అరగదీసి ఆ గందాన్ని నొప్పి వాపు ఉన్న చోట పట్టులాగా వేస్తే ఉపశమనం ఉంటుంది.
◆ ఎవరికీ తెలియని ప్రాణాంతక రసం అనే ఔషధం మాత్రల రూపంలో దొరుకుతుంది. ఇది ఆయుర్వేద మందుల షాపుల్లో లభ్యమవుతుంది. దీన్ని ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా పూటకు ఒక్కటి చొప్పున తీసుకుంటూ ఉంటే సాధారణంగా వచ్చే వృషణాలలో వాపు చక్కగా తగ్గిపోతుంది.
◆ వృషణాల వాపు నొప్పి ఉన్నపుడు బోర్లా పడుకోవడం ఒడిలో ఎక్కువ ఒత్తిడిని కలిగించే బరువులు పెట్టుకోవడం వంటివి చేయకూడదు, వీలైనంత వరకు వెల్లకిలా పడుకోవాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు కూడా.
◆ ఫాంట్ జేబులో మొబైల్ ఫోన్స్ వంటివి పెట్టుకునే అలవాటు మానుకోవాలి, మొబైల్ యొక్క రేడియేషన్ మరియు మొబైల్ వేడి వృషణాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.
◆ మూత్రం వచ్చినపుడు విసర్జనకు వెళ్లకుండా బలవంతంగా నిగ్రహించుకోవడం కూడా వృషణాల వాపు నొప్పికి కారణం అవుతాయి కాబట్టి కాలకృత్యాలు విషయంలో జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలి.
చివరగా…..
వృషణాల వాపు మరియు నొప్పి అనేది సాధారణంగా ఎదురయ్యే సమస్య అయినా దానికి పైన చెప్పుకున్న చిట్కాలు మరియు జాగ్రత్తలు పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
మంచి విషయాలు తెలుస్తున్నాయి
ధన్యవాదములు