The Best Foods to Boost Your Energy

ఉక్కను కూడా తుక్కు తుక్కు చేసే బలాన్ని తెచ్చిపెట్టే అతి బలమైన ఆహారం……..

ప్రకృతి వైద్యంలో పచ్చి కొబ్బరికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారంలో అతి ముఖ్యమైన ఆహారం కొబ్బరి. మరియు కొబ్బరిలో మేధాశక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి మరియు మెదడు యొక్క నిర్మాణానికి, మెదడు పనితీరు కి కావలసిన అన్ని ఈ పచ్చి కొబ్బరి లో లభిస్తాయి. బలాన్ని ఇచ్చే మంచి కొవ్వులు దీనిలో ఉంటాయి. అందువల్లనే మన పెద్దలు ఏదైనా నా శుభకార్యాలలో శుభం జరగాలని. కొత్త వస్తువులు కొన్నప్పుడు శుభం జరగాలని కొబ్బరి కాయలను కొట్టి వాటి చిన్న చిన్న ముక్క లను ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు.

అటువంటి  కొబ్బరిని నేచురోపతి లో ఆహారంగా తీసుకుంటారు. ఈ కొబ్బరిని ఒక మీల్ లాగా అరటి పండుతో కలిపి పెద్దలైన నేచురోపతి వైద్యులు తీసుకునేవారు. 100 గ్రాముల పచ్చికొబ్బరిని తీసుకుంటే అందులో 444 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ కొబ్బరి తినడం వలన మేధాశక్తి పెరుగుతుంది అనడానికి కేరళ వాళ్ళు ఒక ఉదాహరణ. అంతేకాకుండా గుండె జబ్బులు కూడా రాకుండా ఉండడానికి ఉపయోగ పడుతుందని దానికి కూడా కేరళ వాళ్ళు ఒక ఉదాహరణ. కొబ్బరి వాడడం వలన మెంటల్ గా మరియు ఫిజికల్ గా మంచి శక్తిని ఇస్తుంది.

ఒక కొబ్బరికాయ మరియు 4 అరటి పండ్లను కలిపి తీసుకుంటే డబల్ మీల్స్ యొక్క శక్తిని ఇస్తుంది. ఇలా జర్నీలో వెళ్ళినప్పుడు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కూడా ఉంటుంది. మరియు బయట ఆహారం తీసుకునే అవసరం కూడా ఉండదు. ఇలాంటి మీల్స్ రోజులో  ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. ఇది అతి బలమైన ఆహారం. మరియు సామాన్యుడికి ది బెస్ట్ ఫుడ్. వీటిని రోజులో ఒక పూట ఆహారంగా తీసుకోవచ్చు. ప్రకృతి వైద్యంలో  ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. కనుక ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి.

మన దృష్టిలో ఆహారం అంటే అన్నం, కూరగాయలు, స్నాక్స్ మరియు టిఫిన్స్ లను ఆహారంగా భావిస్తాము. మన పెద్దలు మనకు ఆ విధంగా అలవాటు చేశారు. ఈ మధ్యలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అవగాహన మనలో ఏర్పడింది కాబట్టి ఇప్పుడు అలాంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు పొందే మార్గంలో లో ఇది ఒక క మంచి ఆహారం..

Leave a Comment

error: Content is protected !!