ఇంట్లో ఎలుకలు చేరినప్పుడు అవి ఆహార పదార్థాలను పాడుచేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దానితోపాటు అవి కరవడం వలన భయంకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఎలుకల్ని బయటకు పంపించడం చాలా అవసరం. అయితే చాలామంది వాటిని చంపడం పాపంగా భావిస్తారు. కానీ అలాగని వాటిని ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎలుకల్ని చంపకుండా బయటకు పంపడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.
ఎలుకల శరీరంలో వేడిని కలిగించి మంట పుట్టించడం వలన అవి బయటకు వెళ్ళిపోయేలా చేయడానికి మనం ఒక నాలుగు చెంచాల గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ మిరియాల పొడి కలుపుకోవాలి. మిరియాలను బాగా దంచి లేదా మిరియాల పొడి వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా దేశి వాళీ నెయ్యిని కూడా వేయాలి. ఎలుకలు ఈ పిండిని తినడానికి బయటకు వస్తాయి. వీటిని తినడం వలన దీనిలో వేసిన కారం మిరియాల పొడి కలిపి కావాలంటే కొద్దిగా నీటిని చేర్చి చిన్న చిన్న ఉండలుగా కలిపి ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట పెట్టాలి.
ఈ ఉండలు పెట్టినప్పుడు బాత్రూములు మీరు అందుబాటులో ఉండే చోట ఎలకల వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే శరీరంలో మంట పుట్టగానే అవి నీటిని వెతుక్కుంటాయి నీరు దొరికితే దాని వలన మళ్ళీ అక్కడే ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు వాసన కూడా ఎలకల కి నచ్చదు ఉల్లిపాయలను కట్ చేసి ఎలకలు తిరిగే చోట పెట్టడం వలన అవి బయటకు వెళ్లిపోతాయి. అయితే ఉల్లిపాయల వాసన నచ్చక ఎలుకలు కొరకడం వల్ల అవి త్వరగా చెడిపోయి దుర్వాసన వస్తాయి.
లవంగాల వాసన కూడా ఎలుకలకు నచ్చదు గనుక ఎలకలు ఉండేచోట పెట్టడం వలన ఎలుకలు బయటకు వెళ్లిపోతాయి. బేకింగ్ సోడా కూడా ఎలకలకు నచ్చదు. దీనిని ఎలుకలు ఉండేచోట పెట్టవచ్చు. ఒకవేళ ఎలుకలు దానిని నీటిలో కలిపి స్ప్రే చేయడం వలన ఊపిరాడక ఎలకలు బయటకు వెళ్తాయి. జిల్లేడు ఆకులు నుండి వచ్చే పాలను ఒక చిన్న గిన్నెలో సేకరించి దానితోపాటు మినుములు, నువ్వులను కలిపి మంచి ఉండలుగా చేసి ఎలకల కన్నాల దగ్గర పెట్టాలి. వీటిని తినడం వల్ల ఇబ్బంది పడి బయటకు వెళ్లిపోతాయి. ఇందులో ఏవైనా ఒక చిట్కాను ఉపయోగించి ఎలకలను బయటకు పంపించవచ్చు.