The Golden Soup that Will Make Your Skin Glow

సంవత్సరాలుగా పేరుకున్న మురికి, సన్ టాన్ 5 నిమిషాల్లో పోయి మీ స్కిన్ తెల్లగా మారుతుంది

మీ చర్మం ఇంతకముందు  కంటే ఇప్పుడు నల్లగా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం సన్ టాన్, జిడ్డు, మురికి పేరుకుపోవడం.  సన్ టాన్  పోగొట్టుకోవడానికి పార్లర్ కు వెళ్తే  1200 నుంచి 1500 వరకు ఛార్జ్ అవుతుంది. కానీ అలాంటి ఖర్చు ఏమీ లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.  దీని కోసం ముందుగా  మనకు కావలసినవి  మీడియం సైజులో రెండు బంగాళదుంపలను తీసుకొని పీల్  చేసి మెత్తగా తురుముకోవాలి.

      ఈ తురుముకున్న ఫేస్ట్ పలుచటి  క్లాత్ లో వేసుకొని వడకట్టి  జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్  పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి.10 నిముషాల తర్వాత పైన ఉన్న ఉన్న వాటర్ వంపుకోవాలి. గిన్నెలో అడుగుకి పిండి పదార్థం దిగుతుంది.  ఇది బ్లీచ్ కంటే పవర్ ఫుల్ గా పని చేస్తుంది.  బంగాళాదుంప నాచురల్ బ్లీచింగ్ గుణాలు కలిగి ఉంటుంది.   దీనిలో ఒక చెంచా  నిమ్మరసం,  ఒక చెంచా తేనె వేసుకోవాలి. తేనె ఓపెన్ పోర్స్ క్లోజ్  చేయడంలో సహాయపడుతుంది. 

         చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తర్వాత దీనిని ఒక చెంచా ముల్తానీమట్టి వేసుకోవాలి. ముల్తానీ మట్టి  చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. చర్మంపై ఉండే మురికిని, సన్ టాన్  పోగొట్టడంలో  అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత దీనిని ఒక చెంచా ములేటి పౌడర్ ను వేసి బాగా కలుపుకోవాలి. ప్యాక్ వేసుకునే  విధంగా కలుపుకోవాలి. అవసరం అయితే కొంచెం నీళ్లు వేసుకోవాలి.   ఈ ప్యాక్ ముఖంపై కాళ్లు చేతులు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. 

        అప్లై చేసిన తర్వాత 30 నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వలన ముఖం పై నల్లని మచ్చలు, మొటిమలు వల్ల వచ్చే మచ్చలు, ఓపెన్ పోర్స్, సన్ టాన్  వంటివి పోతాయి. ఈ ప్యాక్ బ్లీచ్ కంటే చాలా బాగా పని చేస్తుంది. ఒక రూపాయి కూడా ఖర్చులేకుండా  ఈజీగా ఇంట్లోనే సన్ టాన్ మొత్తం పోతుంది. మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. మీ చర్మం ముందు ఉన్నంత తెల్లగా ఐపోతుంది. జిడ్డు, మురికి పోగొట్టడంలో కూడా ఈ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేయండి తేడా మీరే గమనిస్తారు.

Leave a Comment

error: Content is protected !!