మన చుట్టూ ఉండే మొక్కలు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. కానీ మనకు వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి గానీ ఆ మొక్కల గురించి పెద్దగా తెలియదు. అలాంటి మొక్కలలో కూడా ఒకటి మనం చూస్తూనే ఉంటాం. కానీ అది తిప్పతీగ మొక్క అని తెలియదు. మన ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల విరివిగా పెరుగుతుంది. ఇది ఒక్కసారి మన ఇంట్లో వేసుకున్న అంటే ఇంక ఎప్పటికీ అలానే ఉంటుంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి తెలీదు దీనతో ఆరోగ్య రక్షణ ఎంతైనా ఉంది. మనం ప్రతిరోజూ తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. దీనిని ఇంగ్లీష్ లో గిలోయ్ అని పిలుస్తారు. సంస్కృతంలో అమృత్ అని పిలుస్తారు.
తిప్పతీగ అ పల్లెల్లో ఎక్కడపడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి ఇది బహు వార్షిక లత జాతికి చెందిన ఔషధమొక్క్. ఇది ఒక్కసారి పెరిగింది అంటే చాలా సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది. పీకేసిన మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. పక్క ఉన్న చెట్లపై పాకుతూ అల్లుకుపోతుంది. ఈ మొక్కలు ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, టాబ్లెట్, పౌడర్ తయారుచేస్తుంటారు. ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. ఔషదాలలో తిప్పతీగను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు.
తిప్పతీగ లో సహజసిద్ధమైన బయోకెమికల్ ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ ప్రారంభదశలో ఉన్నప్పుడు తిప్పతీగ జ్యూస్ ను తాగమని చెపుతూ ఉంటారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయి ఉన్నప్పుడు ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇన్సులిన్ నాణ్యతను పెంచుతుంది. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది దానిద్వారా శరీర హైపోగ్లైసేమిక్ చర్యను నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఉదయం సమయంలో ఆకులను రెండు నమలడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
ఆరోగ్య రక్షణ కోసం తిప్పతీగ కషాయం ఎలా తయారు చేసుకోవాలి అంటే రెండు ఆకులను తెంచి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీళ్ళు ఐదు లేదా ఏడు నిమిషాల వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచి నీటిని వడకట్టాలి. టీ తాగినట్టు తాగాలి కానీ ఒకసారి ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ ఆకులను ఉపయోగించాలి. కడుపుతో ఉన్నవారు, పిల్లలు, పిల్లలకు పాలిచ్చే తల్లలు ఈ ఆకులను వాడకూడదు.