డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉంది. చాలా మంది దీని వలన వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు. షుగర్ భోజనానికి ముందు 80mg/dl-120mg/dl భోజనం తర్వాత 180mg/dl ఉండాలి. కానీ కొంతమందిలో 200, 300, 400 వరకు ఉంటుంది. ప్రతి 7 సెకండ్లకు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వలన ఒకరు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెబుతున్నారు.
డాక్టర్లు ఇచ్చే మందులు షుగర్ను నియంత్రణలో ఉంచుతాయి కానీ శాశ్వతంగా తగ్గించలేవు. షుగర్ నియంత్రణలో ఉపయోగపడే కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వలన సహజంగా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ మొక్కలు మన ఇంటి దగ్గర అందుబాటులో ఉండేవి. అందులో మొదటి మొక్క తిప్పతీగ.
ఈ చెట్టుకి ఎర్రటి కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. వీటి ఆకులు మందంగా మెరుస్తూ హృదయాకారంలో ఉంటాయి. ఇవి రోడ్డుకిరువైపులా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ మొక్కలు గుర్తించడం కష్టం అయినప్పుడు పెద్దవారి సహాయంతో గుర్తించండి. నాలుగు ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని 21 రోజులు పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది.
రెండవ మొక్క జామ.ఈ ఆకులలో షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది. నాలుగు లేదా ఐదు ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతి రోజూ తాగడం వలన షుగర్ నియంత్రణలో ఉండటం గమనించవచ్చు. మూడవ మొక్క కరివేపాకు. ప్రతిరోజూ ఉదయం 4 కరివేపాకు ఆకులను నమలడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి.
నాల్గవ మొక్క కలబంద. కలబందలో ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని అనేక చర్మ, జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తుంటాం. అలాగే ఆరోగ్యరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద చిన్నముక్కలోని గుజ్జును ఒక గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది.
ఇక ఐదవ మొక్క తులసి. తులసి ఆకులు వాసన పీల్చడం వలన, ఇంటి ముందు ఉండటం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని మనందరికీ తెలుసు. పది ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో పది నిమిషాలు మరిగించి ఉదయాన్నే పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి శాశ్వతంగా పోతుంది.
ఇక ఆరవ యొక్క మామిడి లేదా నేరేడు. ఈ రెండు ఆకులను కలిపి నీటిలో మరిగించి పరగడుపున 21 రోజులు తాగడం వలన శాశ్వతంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.ఈ ఆకులు అనేక ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. ఇవి సహజంగా షుగర్ ను కంట్రోల్లోకి తీసుకు రాగలవు.
ఏడవ మొక్క బిల్వ పత్రాలు. శివునికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకుల హని బిల్వపత్రాలు అని కూడా అంటారు. ఈ మొక్క ప్రతి ఊరిలోనూ శివాలయాలలో అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం బిల్వపత్రాల లో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులను మరిగించి ఆ కషాయాన్ని రోజు తీసుకోవడం వలన షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.