These Homemade Hair Masks Will Give You Longer, Thicker Hair Instantly

చాలెంజ్ చేసి చెప్తున్నా…… మీ ఊడిన జుట్టు ఫాస్ట్ గా దృఢంగా పెరగాలంటే ఈ చిట్కాను పాటించండి…

                       ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మరియు జుట్టు రాలిన ప్రదేశంలో కొత్త జుట్టు రాకపోవడం వలన జుట్టు పలుచగా ఉంటుంది. దీనికోసం ఎన్ని హెయిర్ ఆయిల్ ఉపయోగించిన ఫలితం లేదనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఉపయోగిస్తే మీ జుట్టు రాలిన ప్లేస్ లో కొత్త జుట్టు త్వరగా ఎదుగుతుంది. అంతేకాకుండా మీ జుట్టు చాలా దృఢంగా ఒత్తుగా ఎదుగుతుంది. దీనికోసం మన ఇంట్లో ఇంట్లో లభించే పదార్థాలతోనే ఈ చిట్కాను తయారు చేసుకుంటున్నాం.

ఇవి ఇంట్లో లభించే పదార్థాలు కావున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ధైర్యంగా ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది అలోవెరా యొక్క కాండం. అలోవెరాను ఉపయోగించడం వలన మన జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. అంతేకాకుండా అలోవెరాను ముఖం యొక్క సౌందర్యం పెంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు అలోవెరాను తీసుకొని వాటి యొక్క ముళ్ళు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
                  తర్వాత మనకు కావాల్సింది కరివేపాకు. కరివేపాకు ప్రతి ఒక్క ఇంటిలో లభిస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్ కె మన జుట్టును ద్రృఢంగా చేయడానికి మరియు నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఐదారు రెమ్మల కరివేపాకు తీసుకొని నీటిలో కడుక్కొని గిన్నెలోకి తీసుకోవాలి. మూడోదిగా మనకు కావాల్సింది కలోంజి విత్తనాలు ఇది ఒక స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమం ఒక గిన్నెలోకి తీసుకొని అందులో విటమిన్ ఇ క్యాప్సిల్ శిరంను వేసుకుని బాగా కలుపుకోవాలి.
                    ఇలా తయారైన ప్యాక్ ను మన జుట్టుకు కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు మొత్తం అప్లై చేయాలి. ఇలా చేసిన అరగంట తర్వాత ఏదైనా మైల్డ్ షాంపు ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలాగా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం ద్వారా మన జుట్టు రీ గ్రోత్ మొదలై జుట్టు దృఢంగాను ఒత్తుగాను పెరుగుతుంది. ఈ ప్యాక్ ను డ్రై లేదా ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించడం వలన ఎటువంటి నష్టం ఉండదు….

Leave a Comment

error: Content is protected !!