These three are the most dangerous zodiac signs

ఈ మూడు రాశుల అమ్మాయిలకు కోపమెక్కువ

మనం పుట్టిన దగ్గర నుండి ప్రతి విషయం లో ప్రతి కార్యాన్ని శాస్త్ర ప్రకారం జరిపిస్తారు పెద్దలు. పుట్టిన కాలం, నక్షత్రం,  తిధి వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని జాతకం కూడా రాయిస్తారు.

         జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి. పుట్టిన సమయం, తిథి, నక్షత్రాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక రాశి ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే అయితే ఆ 12 రాశులలో మహా కోపం కలిగిన వారు మూడు రాశులు వారు ఉన్నారు.  ఆ మూడు రాశులు వారితో మనం జాగ్రత్తగా ఉండాలండోయ్ అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. చెడును సహించలేని వాళ్ళు, ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు అందుకే వారికి తొందరగా కోపమొచ్చేస్తుంది. ఇంతకు ఆ మూడు రాశులు ఏంటో చూద్దామా……

మేష రాశి. (Aries)

12 రాశులలో మొదటిది మేషరాశి. ఈరాశి అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ. ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వీరికి ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ. బద్ధకం అనేది వీరికి శత్రువు అని చెప్పవచ్చు. ఏ పని అయినా చాలా ఉల్లాసంగా చేస్తారు.ఈ రాశి వారికి మొండి పట్టుదల ఎక్కువ. ఈ మొండి పట్టుదల నుండే కోపం కూడా బాగా వస్తుంది వీళ్లకు. చేసే పనులకు ఆటంకం కలిగిస్తూ, వాళ్ళ సమయాన్ని తినాలని చూస్తే మాత్రం కోపం నషాలానికి ఎక్కుతుంది వీళ్లకు. అలాగని వీళ్లకు మనసు లేదని అర్థం కాదండోయ్. ఎదుటి వ్యక్తిని చక్కగా అర్థం చేసుకుని, చాలా సరదాగా ఉండగలరు వీళ్ళు. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించగలరు.  ఒక్కటి మాత్రం వీళ్ళ గూర్చి చెప్పవచ్చు వీళ్ళు మాటల్లో మనుషులు కాదు చేతలలో చూపెట్టేవాళ్ళు.

వృశ్చిక రాశి (Scorpio)

12 రాశులలో చాలా బలమైన రాశి ఏది అంటే వృశ్చిక రాశే. ఈ రాశి వారికి కోపమెక్కువ, కోపం తో పాటు ప్రేమ, అభిమానం ఆప్యాయత కూడా చాలా ఎక్కువ. ఎదుటి వ్యక్తుల లోపాలను వీరు ఎత్తి చూపలేరు. ఒకరిని విమర్శించరు. తమ వారి కోసం ఏం చేయడానికి అయినా వీరు వెనుకాడరు.ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని సాధించేవరకు వీరు విశ్రమించరు. ఒకరకంగా చెప్పాలంటే దాన్ని సాధించి తీరడమే వీళ్ళ మొదటి లక్ష్యం అన్నట్టు శ్రమిస్తారు. కోపంతో పాటు ప్రేమ కూడా వీళ్లకు ఎక్కువేనండి. అయితే వీళ్ళ కోపానికి అర్థముంటుంది. అందులో కూడా తప్పకుండా ప్రేమ అభిమానాలు ఉంటాయి.  కుటుంబానికి స్నేహితులకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తానికి వీరు అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు.

కుంభ రాశి. (Aquarius)

కుంభ రాశి అమ్మాయిలు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే నమ్మకం కలిగిన వారు కాదు. తమ కష్టాన్ని, తమ శక్తిని నమ్ముకుని తమ తెలివిని పెట్టుబడిగా పెట్టుకుని సాగే వారు వీరు. అందుకే వీరికి కోపం ఎక్కువ. తమ లక్ష్యానికి అడ్డుపడేవారి ముందు వీరు అగ్నిగోళమే అవుతారు. వీరికి పట్టుదల ఎక్కువ అలాగే వీళ్ళలో మానసిక సామర్థ్యము కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఏ పని అయినా ఆడుతూ పాడుతూ చేసేస్తారు. వీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. తమకు అక్కర్లేని విషయాలను పట్టించుకుని లేని తలనొప్పి తెచ్చుకునే వారు కాదు. వీరి చాతుర్యం తో దేన్నైనా అవలీలగా సాధిస్తారు. వీళ్ళు గొప్ప లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు.

చివరగా…….

కోపం అందరికి ఉంటుంది అయితే పై మూడు రాశులు వారికి అది ఇంకా ఎక్కువ ఉంటుంది అంతే.  అనవసరంగా పై మూడు రాశులు వారితో గొడవకు దిగకండి ఎందుకంటే కోపమే కాదు వారిలో చతురత కూడా ఎక్కువే,  ఎంతసేపైనా వాదించి గెలిచి నిలవగలరు అందుకే వారితో పెట్టుకోకండి.

Leave a Comment

error: Content is protected !!