ప్రస్తుత ఎక్కువ జనాభా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు తగ్గించుకోవడం కోసం అందరూ రకరకాల ఎక్సర్సైజులు, ఆహారం నియమాలు పెట్టుకున్నప్పటికీ బరువు మాత్రం తగ్గట్లేదు. అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కా పాటిస్తూ వ్యాయామం, ఆహార నియమాలు పాటించినట్లయితే అధిక బరువు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. దీని కోసం మనం ముందుగా అవిసె గింజలను తీసుకోవాలి.
వీటిని ఒక కప్పు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దోరగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా వాము, ఒక చెంచా మెంతులను వేసుకోవాలి. అర చెంచా సైంధవలవణం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా గాజుసీసాలో గాలి వెళ్లకుండా స్టోర్ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఒకరికి అయితే ఒక గ్లాసు ఇద్దరికీ అయితే రెండు గ్లాసులు వేసుకోవాలి.
దీనిలో ఒకరికి అరచెంచా చొప్పున పొడి వేసి నీటిని పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి. పరగడుపున ఈ నీటిని టీ తాగినట్టుగా కొంచం కొంచంగా తాగాలి. రెండు రోజులపాటు తాగినట్లయితే శరీరంలో అధిక బరువు తగ్గుతుంది. అవిసె గింజలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అవిస గింజలు శరీర మెటబాలిజం రేటు పెంచి బరువు తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.
వాము శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు వాము ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. మెంతులు శరీరంలో రక్తం శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడతాయి. మెంతులు గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.
మెంతులు డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. వారం రోజుల పాటు ఈ డ్రింక్ తాగినట్లయితే శరీరంలో అధిక బరువు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ డ్రింక్ తాగుతున్నప్పటికీ ఆహారనియమాలు, వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పొడిని తయారు చేసుకుని వారం రోజులు తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.