పల్లెల్లో, పొలాల్లో ఇళ్ళదగ్గర కొంచెం ఖాళీ స్థలంలో ఎక్కువగా కనిపించే మొక్క కోడిజుత్తు మొక్క, చిలక తోటకూర, పిచ్చితోటకూర అని పిలవబడే ఒక రకమైన ఆకుకూర. ఈ మొక్క ఎక్కడబడితే అక్కడే కనిపించడంవలన ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు. గాలిద్వారా విత్తనాలు వ్యాపించి వందల సంఖ్యలో మొలుస్తాయి. పూర్వం మన పూర్వికులు ఇలా సహజంగా దొరికే కూరగాయలతో వంటలు చేసుకుని తినడంవలనే అంత ఆరోగ్యంగా ఉండేవారు. పనికిరాని కలుపుమొక్కగా భావించే ఈ మొక్కను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క అమరాంతేసి జాతికి చెందినది. ఈ మొక్కలు ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తాయి. పూర్వం నుండి ఆయుర్వేద వైద్యం లో చికిత్సలు కోసం ఉపయోగించేవారు. ఈ మొక్కలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, రైబోప్లెవిన్, థయామిన్ , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
వీటి ఆకులను తరుచూ కూరగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క చలువ చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించేందుకు ఈ మొక్క ఆకులను తరుచూ ఏదోక రూపంలో తీసుకోవడం మంచిది. కేరళ ప్రాంతంలో వీటిని ఆహారంలో భాగం గా ఎక్కువగా తీసుకుంటారు. మొలలతో బాధపడేవారు ఈ ఆకులను సేకరించి మెత్తగా పేస్ట్ లా చేసి రాత్రి పడుకునేముందు మొలలపై రాసి ఉదయం కడిగేస్తూ ఉంటే మొలల సమస్య తగ్గుతుంది. ఈ మొక్కలు సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా తయారు చేసి గ్లాసుడు తాగితే డయేరియా తగ్గిపోతుంది. అలాగే రక్తం శుభ్రపడుతుంది. అలాగే రక్తంలో ఉండే మలినాలు తొలగిపోయి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ ఆకురసాన్ని రెండు స్పూన్లు తాగితే తగ్గుతుంది. కంటిచూపును ఈ విత్తనాలు ఆశ్చర్యపరిచేలా పెంచుతాయి. ఈ విత్తనాలు సేకరించి ఎండబెట్టి అందులో సమభాగంగా అంజీరపండును పటికబెల్లం కలిపి పొడిచేసి సీసాలో భద్రపరుచుకోవాలి.
గ్లాసు నీటిలో పదిహేనురోజులపాటు తాగితే కంటిచూపు పెరుగుతుంది. దృష్టి లోపాలకు సంజీవని లాంటిది.గనేరియా వ్యాధికి ఈ ఆకుల పేస్ట్ రాస్తే బ్యాక్టీరియా చనిపోయి వ్యాధి తగ్గిపోతుంది. గిరిజన గ్రామాల్లో విరిగిన ఎముకలను అతికించడానికి ఈ ఆకుల పేస్ట్ను ఉపయోగిస్తారు. ఈ ఆకులను తినడం వలన మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంపై వచ్చే కురుపులకు ఈ ఆకుల పేస్ట్ను రాస్తే ఈజీగా తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చిలకతోటకూర ఆహారంలో భాగం చేసుకోవడం వలన పొందే లాభాలు తెలిసాయి కదా.ఇక ఇంకెందుకు ఆలస్యం పల్లెల్లో అయితే సులభంగా దొరుకుతుంది. పట్నాల్లో కొయ్యతోటకూరగా అమ్మే ఈ ఆకుకూరను తెచ్చుకుని వాడుకుందాం.