Thotakura Amaranthus Health benefits

తోటకూరలో రహస్యం తెలిస్తే ఎపుడూ వదలరు.

రోజువారీ తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. లేలేత తోటకూర ఆకుతో పప్పు చేయడంతో పాటు, తోటకూర కాడలు పులుసు కూడా పెడతారు. అయితే మనం రోజూ తీసుకునే తోటకూరలో ఉన్న పోషకాలు తెలిస్తే షాక్ అవుతాము, అంతే కాదు ఈ తోటకూర చేసే మ్యాజిక్ గూర్చి తెలిస్తే ఇంకెప్పుడూ నాకు తోట కూర వద్దు అనకుండా చక్కగా తినేస్తాము

తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-డి, విటమిన్- ఇ, విటమిన్-కె మరియు విటమిన్ బి6, బి12 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా తోటకూరలో ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, సోడియం, పొటాషియం మొదలైనవి ఉంటాయి. అందుకే తోటకూర పోషకాల గని అని పెద్దలు అంటారు.

మరి ఇన్ని రకాల పోషకాలు నిండి ఉన్న తోటకూరను  ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దామా….

◆తోటకూర రక్తహీనతను తగ్గిస్తుంది, శరీరంలో అవసరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది కాబట్టి అనిమియా ఉన్న వాళ్ళు తోటకూరను ఎంత సమృద్ధిగా తీసుకుంటే అంత మంచిది.

◆తోటకూరలో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.  పిల్లలు, ఎదిగే వయసులో ఉన్నవారు మరియు స్త్రీ లు తప్పనిసరిగా తోటకూర తీసుకోవడం ఉత్తమం.

◆చాలామందిని వేధించే సమస్య బి.పి( అధిక రక్తపోటు). ఈ అధిక రక్తపోటును అదుపులో ఉంచే గుణం తోటకూరలో ఉంది అందువల్ల బి.పి ఉన్నవాళ్ళకు తోటకూరను ఆహారంలో భాగం చేయాలి.

◆రక్తాన్ని శుభ్రపరచడం వల్ల శరీరంలో గుండెకు మంచి రక్తం అందుతుంది దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. మరియు గుండె రక్తనాళాల పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.

◆తోటకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయం సంబంధ సమస్యలు అన్ని పరిష్కరించబడతాయి. పేగుల ఆరోగ్యాన్ని దృఢపరుస్తుంది.  జీర్ణక్రియ మెరుగ్గా ఉండటం వల్ల మలబద్ధకమనే సమస్య దరిచేరదు.

◆తోటకూరలో ఉన్న విటమిన్స్ మరియు ఖనిజాలు శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఫలితంగా తొందరగా జబ్బులకు లోనవకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

◆ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలవిసర్జన సాఫీ గా ఉండటం వల్ల చాలామందిలో తలెత్తే మొలల సమస్యను దూరంగా ఉంచుతుంది, మరియు మొలలు సమస్య ఉన్నవారు తోటకూర తీసుకోవడం వల్ల ఆ సమస్య నుండి తొందరగా బయటపడచ్చు.

◆ఇందులో ఉన్న పీచు పదార్థం తొందరగా కడుపునిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు తోటకూరను తీసుకుంటే తొందరగా సన్నగా అవ్వచ్చు.

చివరగా….

తోటకూర అనేది సాధారణంగానే అనిపించినప్పటికి మిగిలిన ఆకు కూరలతో పోలిస్తే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి ఆకుకూరలో రారాజుగా నిలిచే తోటకూర మన ఆరోగ్యాన్ని  కాపాడుతుందని వేరేలా చెప్పాలా….

Leave a Comment

error: Content is protected !!