గొంతునొప్పి, గొంతులో మంట, గొంతులో కిచ్ కిచ్ ఇలాంటి సమస్యలు మాయం చేసే ఒక అద్భుతమైన హోం రెమడీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అలాగే ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇలాంటి సమస్యలు లేని వారు కూడా ఈ రెమిడీని ఉపయోగిస్తూ ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వస్తే మరి ఎలా ఈ రెమిడీని ప్రిపేర్ చేసుకోవాలి.
ఒక స్టవ్పై గిన్నె పెట్టి రెండు గ్లాసుల మీరు తాగే మంచినీటిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేయాలి.ఇందులో ఉండే సహజసిద్ధమైన యాంటీ వైరల్ లక్షణాలు అనేవి మన గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సాధారణంగా ఉప్పునీటితో గొంతు పుక్కిలిస్తారు కదా అయితే మీరు ఇందులో మీరు బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ , రాళ్ళ ఉప్పు, కళ్ళుప్పు వాడాలి అవి లేకపోతే కిచెన్లో ఉపయోగించే సాల్ట్ వాడకూడదు. ఉప్పు గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అయితే బీపీ ఉన్నవాళ్లు మాత్రం ఉప్పు వదిలేసి కొన్ని తులసి ఆకుల్ని అలాగే అల్లం తురుము యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం నీటిని బాగా మరిగించారు కదా. నీటిలో కొద్దిగా బుడగలు వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆపేసి ఈ నీటిని ఒక రెండు నిముషాలు చల్లారనివ్వాలి. దాదాపుగా గోరువెచ్చగా అయిపోయాయి. గొంతునొప్పి, గొంతులో దురద కానీ మన గొంతులో ఇన్ఫెక్షన్ దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు రెండుసార్లు తట్టుకోగలిగిన గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తీసుకొని పుక్కిలించాలి. మీ గొంతులోకి వీలైనంతవరకు లోపలికి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు బాగా పుక్కిలించి గ్లాసులో ఉన్న నీరంతా అలాగే చేయాలి. ఒక రెండు నిమిషాలు చేసి 15 నిమిషాల పాటు ఈ నీటిని నోట్లో అలాగే ఉంచుకోవాలి తాగ కూడదు రెండుసార్లు చేస్తూ ఉంటే చాలు మీ గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు తొలగిపోతాయి.
మీకు ఆల్రెడీ సమస్య లేకపోయినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా సరే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు తప్పకుండా ఇవ్వండి. నీటిని ఎక్కువగా తీసుకోవటం,.అలాగే హెర్బల్ టీ కానీ, ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకుంటున్న కూడా మీ గొంతు నొప్పి తగ్గిపోతుంది. చల్లగా ఉండే పదార్థాన్ని మీరు వీలైనంత ఎక్కువగా చేయండి. గోరువెచ్చని నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
Confusion ga undi meeru cheppadam…5 mins annaru..malli 2 mins annaru..anyway good tip