సీజన్ మారిందండి.. వర్షాలు తెగ కురుస్తున్నాయి.. అటు వృద్ధులకు, ఇటు పిల్లలకు ఇమ్మ్యూనిటి తక్కువ ఉంటుంది కాబట్టి.. వెంటనే జలుబులు, గొంతులో ఇన్ఫెక్షన్ .. నొప్పి వస్తుంటాయి. ఇది సహజం. ప్రతి తల్లి తన బిడ్డను వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. ఇలా ప్రతిసారి వెళ్ళడం,మందుల పైనే ఆధార పడటం మంచి పధ్ధతి కాదు..
ఇంట్లో దొరికే కొన్ని గృహ వైద్యాలు పాటించి చూడండి.. అలా కూడా తగ్గకపోతేనే.. వైద్యుడిని సంప్రదించండి.
1. కూరలతో చేసే జ్యూస్, నీళ్ళు, హెర్బల్ టీ లు బాగా తీసుకోవాలి. దీని వల్ల అధికంగా ఏర్పడే ఆమము బయటకు వెళ్ళిపోతుంది.
2. వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఒక ప్రకృతి ఔషదం. దీన్ని రోజు ఉదయాన్నే ఉడక పెట్టుకొని తినొచ్చు, లేదంటే దంచేసి తిన్నా సరే.. దగ్గుని దరికి రానివ్వదు.
3. గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటె… ఉప్పు నీల్ల్లతో గార్గిల్ చేసుకోవాలి. ఇలా చేస్తే గొంతుకి ఉపశమనం లభిస్తుంది.
4. సాయంత్ర వేళల్లో పాలు తాగడం, ఆమము కలుగచేసే ఆహార పదార్ధాలు తినడం మానేయాలి.
5. గట్టిగట్టిగా మాట్లాడడం.. అరవడం వంటివి తగ్గిస్తేనే గొంతు నొప్పితో బాధ పడేవారికి విశ్రాంతి లభిస్తుంది.
6. మద్యపానం, ధూమపానం, టీ,కాఫీలు మానేస్తేనే ఆరోగ్యకరం.
7. ఒక గ్లాస్ నీళ్ళను గోరు వెచ్చగా కాచుకొని,అందులో లెమన్ జ్యూస్, తులసి ఆకులు వేసుకొని తేనె కలిపి తాగాలి.గొంతు క్లియర్ అయ్యి ఉపసమనం పొందుతారు. అలాగే రోజుకి ఒకసారైనా స్టీమ్ పట్టాలి.