చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపో థైరాయిడ్ అయితే రెండు హైపర్ థైరాయిడ్. వీటివలన చాలామంది బాధపడుతున్నారు. థైరాయిడ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి మంచి డైట్ ఫాలో అవుతూ థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు.
డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ వలన థైరాయిడ్ అదుపులోకి వస్తుందేమో కానీ పూర్తిగా తగ్గదు. థైరాయిడ్ వలన దీర్ఘకాలం మందులు వాడాలి. పూర్తిగా తగ్గించుకోవాలంటే మందులతో పాటు కొన్ని మార్పులు కూడా ఫాలో అవ్వాలి. వీటివలన మీ థైరాయిడ్ తగ్గిపోతుంది. మీరు తీసుకునే మంచి ఆహారం మీ మెటబాలిజం రేటును పెంచి థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది.
థైరాయిడ్ గ్రంథి టి3, టీ4 హార్మోన్ల ను తగ్గినంత మొత్తంలో ఉత్పత్తి చేయదు. దీని ప్రభావం శరీరంపై పడడం ప్రారంభిస్తుంది. దీనినే హైపో థైరాయిడిజం అంటారు. దీనివలన బరువు పెరగడం, డ్రై స్కిన్, జుట్టు రాలిపోవడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ముఖంలో వాపులు, కండరాల నొప్పులు, మలబద్దకం ఇటువంటి ఎన్నోరకాల సమస్యలు వస్తాయి.
హైపో థైరాయిడిజం తో బాధపడేవారు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా అయొడైజ్డ్ ఉప్పు తీసుకోవాలి.అమెరికన్ హెల్త్ అసోసియేషన్ పరిశోధనల ప్రకారం అయొడైజ్డ్ ఉప్పు వాడడంవలన థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ లోపం వలన శరీరంలో హైపో థైరాయిడిజం వస్తుంది. మన శరీరం సొంతంగా థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేయలేదు కనుక అయొడైజ్డ్ ఉప్పు తీసుకోండి.
అలాగే చేపలు తీసుకోవాలి ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. మెటబాలిజం క్రమబద్ధీకరణ చేసి థైరాయిడ్ ను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.శరీర జీవక్రియ ను మెరుగుపరిచి థైరాయిడ్ ను తగ్గిస్తుంది.
కోడిగుడ్డులో ఉండే అయొడిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకి రెండు గుడ్లు తినడంవలన థైరాయిడ్ తగ్గించుకోవచ్చు. అధికబరువు సమస్య ఉన్నవారు పచ్చసొన తినకూడదు. ఫ్యాట్ తక్కువగా ఉండే పాలు, పెరుగు, ఛీజ్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఎమినోయాసిడ్స్, థైరోసిన్ థైరాయిడ్ హార్మనల్ స్థాయిలను పెంచుతాయి.
కాబట్టి గ్లాసు పాలు, అరకప్పు పెరుగు, అరకప్పు జున్ను తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీన్ కాటిచిన్ థైరాయిడ్ హార్మనల్ స్థాయిలను నిరోధిస్తుంది. యాంటీ థైరాయిడ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకూడదు. సరిగ్గా ఉడకని ఆకుకూరలు తీసుకోకూడదు.
అలాగే బ్రొకోలి, బచ్చలికూర, కాలీఫ్లవర్ లాంటి కొన్ని కూరగాయలు ఆకుకూరలు తీసుకోకుండా ఉంటే మంచిది. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, వేయించిన ఆహారాలు తీసుకోకూడదు. బంగాళదుంప కు దూరంగా ఉండాలి. హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్లు ఎక్కువగా విడుదలవడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ముడిపండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
ఇవి థైరాయిడ్ హార్మోన్లు విడుదలచేయడానికి ఉపయోగపడతాయి. బ్రొకోలి, బచ్చలికూర, కాలిఫ్లవర్ ముల్లంగి, ఆకుకూరలు, పాలకూర ఇలాంటివి చాల మంచిది. హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు తులసి టీ, గ్రీన్ టీ వంటి హెర్బల్ టీ తీసుకోవచ్చు. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
Naku tairod vachin 3 years avtunde chala lav ga aiyanu epudu 68 kgs vunnanu intlo vallu nanu chala lav ga vunav ani tidtunaru aiyasam vastunde body pains kuda vastunai pls deniki samasya chepande