ప్రస్తుత కాలంలో ప్రతి 10 మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఆడవాళ్ళలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫీస్ కి వెళ్లే స్త్రీలు ఒత్తిడికి గురవడం, దానితో పాటు పిరీయడ్ సమస్యలు, గర్భాధారణ సమయంలో వచ్చే సమస్యలు ఇంకా ఎన్నో కారణాల వల్ల కూడా థైరాయిడ్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ థైరాయిడ్ గ్రంధి మన గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. అయితే థైరాయిడ్ వచ్చిన వాళ్లు ఎక్కువగా బరువు తగ్గాలని, మందులు వేసుకుంటే సరిపోతుందని అందరు ఆ భావనలో ఉంటారు.
మనం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, మరియు మన జీవనశైలిలో మార్పుల వలన, థైరాయిడ్ హార్మోన్ సరిగా విడుదల కాకపోవడం వలన థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇదే మన శరీరంలోని జీవ క్రియలను సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను తక్కువ రిలీజ్ చేస్తే హైపో థైరాయిడిజమ్ అంటారు. దీనితోనే చాలామంది బాధపడుతున్నారు. ఒకవేళ థైరాయిడ్ గ్రంధి ఎక్కువ హార్మోన్లను విడుదల చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు.
ఇది కంట్రోల్ అవడానికి మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇది తగ్గడానికి ఇంట్లోనే ఒక రెమిడిని తయారు చేసుకుందాం. దీనికి మనకోసం కావలసింది ధనియాలు. ముందుగా ఒక కడాయిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత నీటిని వడకట్టి వచ్చిన కాషాయం రోజు పరగడుపునే తీసుకోవడం వలన హైపో థైరాయిడిజమ్ కంట్రోల్ అవుతుంది. మరియు ధనియాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. రెండవదిగా మనకు కావాల్సింది అవిస గింజలు. వీటిని ఒక పాన్ పై దోరగా వేయించి ఆ తర్వాత మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి.
దీనిని నెలరోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపి తీసుకోవాలి. దీనిని రోజు ఉదయాన్నే తీసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ధనియాల నీటిని సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. లేదా రెండింటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. మరియు అవిసెగింజల పొడిని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. మరియు ఆహరంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి రోజుకి 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ తో బాధపడేవారు మీ ఆహారంలో పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోకూడదు.