ప్రస్తుత కాలం అందరికీ లేటుగా పడుకోవడం అనేది ఒక వ్యసనం కింద అయిపోయింది. రోజు 11, 12 గంటల వరకు మెలకువగా ఉండి ఉదయం లేటుగా లేగడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇలా లేటుగా నిద్ర లేవడం వలన కొన్ని రకాల నష్టాలు, దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఇది సైంటిఫిక్ గా చెప్పబడింది. 2018 సంవత్సరంలో నార్త్, వెస్ట్ యూనివర్సిటీ యూ.కే వారు 4,33,268 మంది లేటుగా నిద్ర లేచే వారిని తీసుకొని వాళ్ల పైన పరిశోధనలు జరిపారు. ఇలా లేటుగా నిద్రలేచే వారికి 40% కార్డీయో వ్యాస్కులర్ డిసీజెస్ గుండె సంబంధమైన జబ్బులు.
అలాగే వీటితో పాటు వచ్చే మెటబాలిక్ డిసార్డర్ అంటే జీవన విధానం సరిగ్గా లేనందు వల్ల వచ్చే ఒబేసిటీ గాని, డయాబెటిస్ ఇలాంటివన్నీ ఫ్యాటీ లివర్, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చి వయసు రాకుండానే ఇలాంటి సమస్యలతో చనిపోతున్నారు అని దీనికి లేటుగా నిద్ర లేవడం కారణమని వీరిపై అధ్యయనం చేసి మరి చెప్పారు. రెండవ సమస్య తీసుకుంటే లేటుగా నిద్ర లేవడం వలన 30% సైకాలజికల్ డిజార్డర్స్ గురి అవుతున్నారు. మానసిక సంబంధమైన సమస్యలు ఎక్కువ పర్సెంట్ రావడానికి లేటుగా నైట్ పడుకోవడం రీజన్ అయితే లేటుగా లెగుస్తున్నాం.
దీనివలన మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఎంజ్గైటీంగ్ వంటివి రావడానికి నిద్ర లేటుగా లేగడం కనుక ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మేల్కొనాలి. ఇలాంటి ప్రయత్నం చేయకపోతే మనము మన పిల్లలు ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక మూడవ నష్టం తీసుకుంటే లేటుగా నిద్రలేగడం వలన బాడీలోని జీవ గడియారం దెబ్బతిని హార్మోనల్ డిస్టబెన్స్ ఎక్కువగా రావడానికి కారణం అవుతుంది. నాలుగవ నష్టం తీసుకుంటే బ్రెయిన్ లో సిగ్నలింగ్ ఆక్టివిటీ బాగా జరుగుతుంది.
లేటుగా లేచే వారికి ఇది ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్ లాంటి వాటికి గురవడానికి, నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి, బ్రెయిన్ కణాల్లో రిలీజ్ అయ్యే వ్యర్ధాలను క్లియర్ చేసుకోవడానికి బ్రెయిన్ సెల్స్ లో ప్రొపర్ హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం వలన దీర్ఘకాలిక మతిమరుపు, బ్రెయిన్ కణాలు కుశించుకు పోవడానికి లేటుగా నిద్ర లేవడం ఒక కారణం. కనుక త్వరగా పడుకొని, త్వరగా నిద్ర లేచి లేచిన తర్వాత వ్యాయామాలు చేయడం వంటి హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకుంటే మన ఆరోగ్యానికి మంచిది…