చాలామంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందో కొందరికి ఒక పట్టాన అర్థం కాదు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు అధికంగా భావోద్వేగాలకు గురికావడం వల్ల మానసిక ఒత్తిడి మొదలవుతుంది. అలాగే చదువు, చేరుకోవలసిన లక్ష్యాలు, పోటీ ప్రపంచంతో పాటు పరిగెట్టాలని మానసికంగా అలసిపోవడం వంటివి డిప్రెషన్ కు కారణం అవుతాయి. అయితే డిప్రెషన్ ను దగ్గరకు రానీయకుండా చేసే కొన్ని సూచనలు, సలహాలు మీకోసం చదివేయండి.
ఒత్తిడికి దూరంగా ఉండటం
ఒత్తిడి మరియు నిరాశ లేదా ఆందోళన మధ్య సంబంధం ఉంటుంది. నిరాశకు గురయ్యే వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగి ఉంటే అది అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. మానసిక ఆరోగ్యం, జీవిత సంతృప్తి మరియు సాధారణ ఆరోగ్యంపై ఒత్తిడి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడిని నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు, కానీ అలా చేయడానికి చర్యలు తీసుకోవడం, తగినంత నిద్ర మరియు విశ్రాంతి, పని నుండి విరామం తీసుకోవడం, ప్రాణాయామం, వ్యాయామాలు మరియు ధ్యానం మొదలైనవి పాటించడం.
వ్యాయామం
శారీరక శ్రమ యాంటిడిప్రెసెంట్గా పనిచేస్తుంది.
ఇది శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంచుతుంది. డిప్రెషన్ కొంతమందికి వ్యాయామం చేయడం కష్టతరం చేస్తుంది, కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది మరింత దిగజారుతుంది.
వ్యాయామం ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉదయం 5 నిమిషాల నడక లేదా సూర్యనమస్కారాలు లేదా తేలికపాటి ఆసనాలు వంటివి ప్రయత్నించవచ్చు. క్రమంగా దాని సమయాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళవచ్చు.
ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం నిరాశను నివారించడానికి మరియు మానసిక ప్రశాంతతను పెంచడానికి సహాయపడుతుంది. తాజా పండ్లు మరియు కూరగాయలు, గ్రీన్ టీ, సోయాబీన్ ఉత్పత్తులు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలు, తృణధాన్యాలు, చేపలు వంటి పదార్థాలు తీసుకోవాలి. అలాగే రెడ్ బీఫ్, మాంసం ఉత్పత్తులు, నిల్వక్ చేసిన పదార్థాలు, అధిక కొవ్వులు కలిగిన పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉన్నవి మరియు శీతలపానీయలు మొదలైనవి వాడటం తగ్గించాలి.
తాజా పండ్లు మరియు కూరగాయలు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి మరియు కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు గట్ మైక్రోబయోటాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి, ఇది నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్ర
నిరాశ మరియు నిద్రలేమి మధ్య బలమైన సంబంధం ఉంది. నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి యొక్క లక్షణాలను మరింత దిగజార్చుతుంది.
నిద్రను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు:
◆సెలవు రోజుతో సహా ప్రతి రోజు ఒకే సమయంలో నిద్ర లేవడం.
◆నిద్రపోయే గది నిశ్శబ్దంగా, చీకటిగా మరియు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి.
◆నిద్రపోయే ముందు అతిగా తినకూడదు.
◆అలాగే కాఫీలు, మద్యపానం వంటివి మానుకోవాలి.
◆ పగటిపూట శారీరక వ్యాయామం చేయండి.
◆ నిద్రకు అరగంట ముందే మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేయాలి.
◆పడుకున్న 20 నిమిషాల్లో నిద్ర రాకపోతే, కొద్దిసేపు ఏదైనా పుస్తకం చదవడం ద్వారా మళ్ళీ నిద్రపోవడానికి సంసిద్ధులు కావచ్చు.
మద్యం మరియు మాదకద్రవ్యాల వాడకం
ఆల్కహాల్ మరియు డ్రగ్ అనేది డిప్రెషన్ లో ఉన్నవారికి ఆ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
చాలా మందికి డిప్రెషన్ లో ఉన్నపుడు, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నపుడు దాన్ని మర్చిపోవడానికి మద్యం, డ్రగ్స్ వంటి నిషిద్ధ దారులవైపు వెళ్తుంటారు. అయితే అవన్నీ మత్తును ఇవ్వడం ద్వారా స్పృహను కోల్పోయేలా చేయడం, అంతకు మించి ఆరోగ్యాన్ని పాడుచేయడం జరుగుతుంది.
కౌన్సిలింగ్
ఉత్తమమైన వారు తాము డిప్రెషన్ లో ఉన్నాము అనిపించినపుడు చేయవలసిన ముఖ్యమైన పని తమకు స్వాంతన చేకూర్చగలిగే వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడటం. దీనివల్ల మనసులో పేరుకుపోయిన బాధ, మానసిక ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయి మనసు ప్రశాంతంగా మారే అవకాశాలు చాలా ఉంటాయి. మన చుట్టూ ఉన్న చాలామందిలో డిప్రెషన్ బాధితులు ఉంటే వీలైనంత వరకు వారికి సమయం కేటాయించడం ఉత్తమం.
చివరగా…
మానసిక ఒత్తిడి అనేది ఎంత పెద్ద సమస్యో పైన చెప్పుకున్నవి పాటిస్తే అది కూడా మెల్లిగా తగ్గిపోతుంది. మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవడం మన బాధ్యత మరి.