కొందరికీ గోర్లు పుచ్చిపోయి ఉంటాయి. దానికి కారణం ఏమిటనేది తెలియదు కానీ బాగా పుచ్చిపోయి నొప్పి మరియు మంటతో బాధ పడుతూ ఉంటారు. కొందరికైతే గోరు చుట్టు పక్కల భాగమంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. దానికోసం రకరకాల మందులు ఆయింట్మెంట్స్ వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా గోర్లు పుచ్చిపోవడానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. కొందరికి విటమిన్స్ లోపం అయితే కొంత మందికి ఇంట్లో వాడే సబ్బులు లేక సర్ఫ్ పడక పోవడం వలన కూడా గోర్లు పుచ్చిపోతాయి.
గోర్లు పుచ్చి పోయిన వాళ్ళు ఈ పనులు చేసుకోలేక కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. గోర్లు పుచ్చడం వలన చాలా నొప్పిగా ఉంటుంది. గోర్లు పుచ్చడం తగ్గి గోర్లు అందంగా తయారవ్వాలంటే ఈ చిట్కాలను ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా కొంచెం లవంగ మొగ్గలను తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఒక చెంచా లవంగాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పదినిమిషాల పాటు బాగా మరిగించి పోవాలి. లవంగాలలో ఉండే పోషక విలువలు మొత్తం నూనెలోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె కొంచెం చల్లారనివ్వాలి. కాటన్ లేదా ఇయర్ బడ్ తో ఈ నూనెను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చిన గోళ్లపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలా ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
ఇలా చేసినట్లయితే గోర్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. ముందుగా పుచ్చిన గోర్లు నొప్పి మంట తగ్గుతాయి. పుచ్చిన గోర్లు మొత్తం ఊడిపోయి కొత్త గోర్లు రావడం మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు రెండుసార్లు చొప్పున గోర్లు పుచ్చడం తగ్గే అంత వరకు అప్లై చేసుకోవాలి. గోరు చుట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఈ నూనెను అప్లై చేయడం వలన ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. గోర్లు పుచ్చిపోయి ఎన్ని మందులు వాడినా నొప్పి కూడా తగ్గలేదు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ నూనెను తయారు చేసుకుని రాసి చూడండి. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ రెమెడీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక సారి ట్రై చేసి చూడండి.