నేటి మన ఆధునిక జీవన శైలి ఆహారపు అలవాట్లు, నాణ్యత వలన పళ్ళు ఆరోగ్యంగా ఉన్నవారు చూద్దామంటే మచ్చుకి కూడా కనిపించరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. కూల్ డ్రింకులు, మైదా, తీపి పదార్థాలు అధికంగా తినడం వలన ఏర్పడే పంటి సమస్యలు , సెన్సిటివ్ నెస్ వలన అనేక మంది పంటిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో పళ్ళు అతి ముఖ్యమైన అవయవాలు.
ఆహారాన్ని బాగా నమలడానికి సహాయపడి ఆహారం బాగా జీర్ణమై పోషకాలు శరీరానికి అందడంలో చాలా బాగా మన దంతాలు ఉపయోగపడతాయి. అయితే పంటి ఆరోగ్యం దెబ్బతినడం వలన శరీరంలో జీర్ణసంబంధ సమస్యలు కూడా అనేకం వస్తాయి. అందుకే అసలు పండ్లు పుచ్చిపోకుండా ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తీపి పదార్థాలు ముఖ్యంగా పంటికి అంటుకునే స్వీట్లు, చాక్లెట్లు తినకుండా ఉండాలి. ఒకవేళ తింటే వెంటనే నోటిని పుక్కిలించడం చాలా అవసరం.
అలాగే చెరుకు గడలు తినడం వలన ఆ తీపికి పళ్లు పుచ్చిపోతాయని చాలామంది భావిస్తారు. కానీ చెరుకు తినడం వల్ల పంటి చుట్టూ ఉండే బ్యాక్టీరియా, పాచి సహజంగా శుభ్రపడతాయి. ప్రతిరోజు రాత్రి డిన్నర్లో రెండు చిన్న చెరుకు గడలు తినడం వలన పళ్ళు నాచురల్ గా శుభ్రపడుతాయి. అలాగే కమలా, బొప్పాయి, మొలకలు, డ్రై ఫ్రూట్స్, ఎండు విత్తనాలు, పీచు అధికంగా ఉండే మొక్కజొన్న ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల పళ్ళు శుభ్రం చేసినట్టు ఉండడమే కాకుండా గార పట్టకుండా, రంగు మారకుండా జీవితకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కేవలం ప్రకృతిలో మాత్రమే దొరికే ఆహారం తీసుకునే జంతువులు ఎటువంటి పంటి సమస్యలను ఎదుర్కోవు. కారణం ప్రకృతి సహజంగా దొరికే ఆహారాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు, మసాలా ఆహారాలు, ఆరోగ్యాన్నీ దెబ్బతీయడంలో, పంటి పుచ్చు అధికం చేయడంలో ముందుంటాయి. మనం ఇప్పటి కాలంలో రకరకాల పేర్లతో దొరికే పేస్ట్లు , నోటి ప్రెష్నర్లు తో నోటిని శుభ్రపరుచుకుంటూనే ఉన్నాం. కానీ పూర్వకాలంలో నోటిని శుభ్రపరుచుకొనే సాధనాలు లేనప్పుడు కూడా వారందరి పళ్ళు ఆరోగ్యంగా ఉండేవి.
పేస్ట్ లు కనీసం అరగంట, గంట మాత్రమే పంటిని శుభ్రంగా ఉంచగలవు. కొంతసేపటి తర్వాత తిరిగి నెమ్మదిగా బ్యాక్టీరియా తయారవడం మొదలవుతుంది. మనం తినే ఆహారాలు కూడా వీటికి సహకరిస్తాయి. అందుకే మనం తినే ఆహారంలో పండ్లు, పండ్ల రసాలు, చెరుకు గడలును అధికంగా తీసుకుంటూ జంక్ఫుడ్, స్వీట్లుకు దూరంగా ఉండడం వలన పంటి ఆరోగ్యంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
Heading yem pettaru, matter yemi icharu, yenduku time waste chestharu