ToothBrush Hack for hair growth

ఒకసారి కొబ్బరి నూనెలో ఒక చిటికెడు ఈ పౌడర్ కలిపి రాస్తే జుట్టు మోకాళ్ల వరకు పెరుగుతుంది

ఆడవారికి పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం. దాన్ని పొడవుగా, అందంగా పెంచుకోవడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వల్ల జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది.  ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్ ను ఉపయోగించడం కంటే  నాచురల్ పద్ధతిలో మనం ఆయిల్స్  ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 

    ఇప్పుడు మనం తెలుసుకోబోయే నూనెను తయారు చేసుకుని ఒక వారం  ఉపయోగించినట్లయితే మీ జుట్టు మోకాళ్ళ వరకు పెరుగుతుంది. దీని కోసం ముందుగా ఒక చెంచా మెంతులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించడమే  కాకుండా జుట్టు పొడిబారకుండా మోయశ్చైరైజ్ చేయడంలో పనిచేస్తుంది. తర్వాత దీని కోసం ఒక చెంచా కలోంజీ విత్తనాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కలోంజీ విత్తనాలు  తెల్ల వెంట్రుకలు తగ్గించి  జుట్టు నల్లబడటానికి సహాయపడతాయి. 

     అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం లో కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. జుట్టు కుదుళ్లు బలంగా  ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒక చెంచా ఎండు ఉసిరికాయలను తీసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలు జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే  తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఒక బాబు తీసుకొని జుట్టు సరిపడినంత కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరినూనె పడదు అనుకున్నవారు మీరు రెగ్యులర్ గా ఉపయోగించే నూనెను వేసుకోవచ్చు. 

        దీనిలో పావు చెంచాడు మెంతులు పొడి, పావు చెంచా   కలోంజీ విత్తనాలు పొడి, పావు చెంచా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. నూనెను వేడి నీటిలో పెట్టి నూనె గోరువెచ్చగా  అయ్యే వరకు ఉండనివ్వాలి. తర్వాత నూనెను వడగట్టుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఈ నూనె  అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది. 

       ఈ నూనె  వారానికి ఒకసారి లేదా వారంలో ప్రతి రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు.  ఈ నూనె ఉపయోగించినట్లయితే మీ జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!