toothpaste essentially consists of

వెన్నులో వణుకు పుట్టించే టూత్ పేస్ట్ ఇదే….. ఇది పచ్చి నిజం

మనం పళ్ళను శుభ్రం చేసుకోవడానికి కెమికల్ తో తయారు చేసిన టూత్ పేస్ట్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈమధ్య చాలామంది దంత క్షయం నుంచి తప్పించుకోవడానికి రెండు పుట్ల బ్రష్ చేయడం మొదలుపెట్టారు. ఈ పేస్ట్ ను ఉపయోగించడం వలన ఇందులో ఉపయోగించే కెమికల్‌ సోడియం ఫ్లోరైడ్ వలన పేగుల గోడల్లో ఉండే విలై అంటే పేగులో ఉండే పోషకాలు అన్నిటిని గ్రహించడానికి సూక్ష్మ గ్రంధులు ఉంటాయి. అవి డ్యామేజ్ అవ్వడానికి కెమికల్ టూత్ పేస్ట్ లో ఉండే ఈ సోడియం ఫ్లోరైడ్ ఒక కారణం.

                       అలాగే టూత్ పేస్ట్ లో వాడే కెమికల్ ఎఫెక్ట్ కి జీర్ణాశయం అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి చేస్తుంది. ఈ చిగురు ఎంత ఉత్పత్తి అయితే యాసిడ్ వల్ల వచ్చే దాడిని తట్టుకునే శక్తి ఉంటుంది. దీనివలన గ్యాసెస్, మంటలు రాకుండా ఈ జిగురు సహాయపడుతుంది. ఈ మ్యూకస్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఇందులో ఉండే కెమికల్స్ కారణం. ఈ కెమికల్ టూత్ పేస్ట్ లో వాడే ట్రై క్లోజన్ వలన ఆస్త్మా, స్కిన్ రెసస్, ఎలర్జీలు రావడానికి కారణం అవుతాయి. టూత్ పేస్ట్ లలో సేకారీన్ అనే స్వీటినీంగ్ ఏజెంట్ ఒకటి వాడతారు. 

          దీనివలన డయేరియా, కడుపునొప్పి, తలనొప్పి వంటివి కొంతమందిలో రావడానికి కారణం అవుతాయి. ఇందులో దంతాలు తెల్లగా ఉండడానికి ఎసిడిక్ నేచర్ ఉండే కెమికల్స్ ఎక్కువగా వాడతారు. దీనివలన దంతం పై ఉండే ఎనామిల్ పాడవుతుంది. పేస్ట్ లో నురగ రావడానికి వాడే సోడియం లారీల్ సల్ఫేట్ అనేది నరాల ద్వారా బాడి లోకి ఎంటర్ అవుతుంది. దీనివలన నరాల బలహీనత రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి హాని కలిగించే కెమికల్స్ కలిగినటువంటి టూత్ పేస్ట్ లు వాడకపోవడం మంచిది.

                 వాటికి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ లు వస్తున్నాయి. ఇవి దోషాన్ని ఇవ్వవు. అందువల్ల ఇటువంటి వాటికి మారితే మంచిది. ఇది ఒక పూట వాడుతు ఇంకొక పూట వేప పూలతో గాని, కానుగ పుల్ల, ఉత్తరేణి పుల్ల వంటి వాటిని ఉపయోగించుకోవడం మన దంతాలకు చాలా మంచిది. వీటి వలన దంతా క్షయం జరగదు. పళ్ళు యొక్క ఎనామిల్ పొర పాడవదు. దంతాల సెన్సిటివిటీ తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి. కనుక ఈ మూడు రకాల పుల్లలను దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడితే మంచిది

Leave a Comment

error: Content is protected !!