మన అలవాట్లే మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలామంది ఏ పనిని సరైన టైమ్ కు చేయరు. క్రమశిక్షణ లేని జీవితంలో ఆరోగ్యం కూడా దారితప్పి మనల్ని హాస్పిటల్స్ వైపు నడిపిస్తుంది. మరి అటువైపు వెళ్లకుండా ఉండాలంటే, మనం సంపూర్ణ ఆరోగ్యవంతుగా మారాలంటే, ఇదిగొండి ఈ కింద చిట్కాలు పాటించండి. లక్షలు పోసిన దొరకని ఆరోగ్యం మన ముందుకు రావడం తథ్యం.
◆భోజనానికి ఒక క్రమబద్ధమైన సమయం ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతిరోజు ఆ సమయాలను అనుసరించాలి.
◆చుట్టూ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేట్టు చూసుకోవాలి. గాలి, వెలుతురు తో పాటు వీలైనంతవరకు పచ్చని చెట్లు ఉండేట్టు చూసుకోవాలి.
◆చిరుతిల్లు తయారు చేయడానికి అధికంగా నూనె మరియు అసంబద్ధమైన పద్ధతులు అనుసరించి ఉంటారు కాబట్టి బయట చిరుతిళ్ళ మీద అసలు ఆధారపడద్దు.
◆బోజనం చేయగానే నిద్ర మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి పూట బోజనం చేయగానే కనీసం వంద అడుగులు అయిన నడవడం ఉత్తమం.
◆రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి. దీని ద్వారా శరీరంలో అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
◆ప్రతిరోజు వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలి దీనివల్ల మానసిక స్థితి సరైన విధంగా ఉంటుంది.
◆సహజమైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోకి వెళ్లే పోషకాలు సహజంగా ఉంటాయి.
◆పగటి వేళ భోజనంలో ఘనమైన ఆహార పదార్థాలు, రాత్రి భోజనంలో సులువుగా జీర్ణమయ్యేలా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
◆ఆహారంలో పీచు ఎక్కువ గా ఉన్నవాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
◆పగటి సమయాల్లో నిద్రపోవడం మానుకోవాలి. దీనివల్ల రాత్రి పూట నిద్రకు ఆటంకం ఏర్పడదు.
◆రుచిగా ఉందని ఆహారాన్ని ఇష్టానుసారం తీసుకోకూడదు, అలాగే తాజాగా, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
◆శాఖాహారమే ఉత్తమమనే విషయం మరువకూడదు. దీనివల్ల శరీరం తొందరగా వృద్ధాప్య ఛాయలకు లోనవ్వదు.
◆ఆహారాన్ని తీసుకునేటపుడు నెమ్మదిగా తినాలి. తొందరనే కారణంతో వేగంగా తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు వస్తాయి.
◆శీతల పానీయాలు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి.
◆వీలైనంత వరకు వివాదాలు, గొడవలకు డోయ్రంగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది.
◆ప్రతి మనిషికి తప్పనిసరిగా ఎనిమిగంటల నిద్ర ఉండాలి. రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటుగా చేసుకోవాలి. దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది మరియు ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది.
చివరగా……
ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి చర్య మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేదే కాబట్టి అనవసరమైన విషయాలను వదిలి జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకుంటూ దానినే చేసుకుంటూ వెళ్లడం వల్ల ఆరోగ్యం మరియు సంతోషకర జీవితం మన సొంతమవుతుంది. మరి తప్పక పాటించండి